హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రవి ప్రకాశ్ వివాదంలో 'ఆ ఛానల్' ఛైర్మన్ పాత్ర..! ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటే ఇదే.. పీకల్లోతు పోర్జరీ వివాదంలో చిక్కుకున్న రవిప్రకాశ్ కు ఈ మెయిళ్ల దుమారం ఆయనను మరింత చికాకు కలిగిస్తోంది. ఇంత వరకు పోలీపుల ఎదుట వివరణ ఇవ్వని రవి ప్రకాశ్ ఎక్కడ ఉన్నాడనే అంశం ఉత్కంఠ రేపుతోంది. అంతే కాకుండా ఆయన ఇటీవల ప్రారంభించిన ఓ న్యూస్ ఛానల్ ఛైర్మన్ చుట్టుకూడా ఉచ్చు బిగుపుకుంటున్నట్టు తెలుస్తోంది. టీవి9 నిధలు కూడా అదే ఛానల్ లోకి మళ్లించినట్టు పోలీసులు ఆధారాలను చూపిస్తున్నారు. ఇదే నేపథ్యంలో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ కోసం పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు నటుడు శివాజీ, రవిప్రకాశ్‌ల మధ్య జరిగిన కొన్ని ఈ మెయిల్ సంభాషణలకు సంబంధించిన వివరాలు కూడా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. శివాజీ, రవిప్రకాశ్‌ల మధ్య జరిగిన నకిలీ ఒప్పందం షేర్ పర్చేజ్ అగ్రిమెంట్‌కు సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలను సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది.

another channel chairman invelvement in Ravi Prakashs controversy.! Police collecting clues .. !!

ఇటీవల జరిపిన సోదాల్లో ఈమెయిల్స్‌లో జరిగిన సంభాషణలు, డ్రాఫ్ట్స్, డ్రాఫ్ట్స్ఒప్పందాన్ని ఫైనల్ చేస్తూ విజయవాడ లాయర్ పంపించిన పూర్తి స్థాయి డ్రాఫ్ట్స్‌ను కూడా అధికారులు సేకరించడం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రవిప్రకాశ్‌కు, మరో ఐదుగురికి మధ్య ఈమెయిల్ సంభాషణలు నడిచాయి. సంభాషణల అనంతరం మెయిల్స్‌ను రవిప్రకాశ్ బృందం డిలీట్ చేసింది. సైబర్ క్రైం పోలీసుల విచారణలో మెయిల్స్‌ను ఫోరెన్సిక్ నిపుణులు రీట్రివ్ చేశారు. ఫైనల్ డ్రాఫ్ట్‌ను విజయవాడకు చెందిన లాయర్ తయారు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒప్పందం చేసి.. గతేడాది ఫిబ్రవరిలో ఒప్పందం జరిగినట్టు రవిప్రకాశ్ బృందం పత్రాలు సృష్టించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యతో అసలు విషయాలు వెలుగుతోకి తెచ్చేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

English summary
Details of some of these mail conversations between actor Shivaji and Ravi Prakash have also emerged. The fake deal between Shivaji and Ravi Prakash is seems to have collected full-scale evidence of the share purchage agreement cyber crime police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X