తెలంగాణకు మరో కంపెనీ.. ఎలక్ట్రిక్ వాహనాలు తయారీ సంస్థ..
తెలంగాణ రాష్ట్రానికి మరో కీలక పరిశ్రమ రానుంది. ఇందుకు సంబంధించి కార్యచరణ సిద్ధమైంది. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి భారీ వాహనాల తయారీ సంస్థ బిలిటీ ఎలక్ట్రిక్స్ తయారీ ప్లాంట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం రాత్రి ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
అమెరికా కాలిఫోర్నియా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో భారీ వాహనాలను తయారు చేస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి. అమెజాన్, ఐకియా, జొమాటో, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలకు తమ వాహనాలను విక్రయిస్తోంది. తాజాగా తెలంగాణలో తన ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. తెలంగాణలో ఏర్పాటు చేసే బిలిటీ సంస్థ ప్లాంట్ ప్రపంచంలో అతి పెద్ద ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ ప్లాంట్‌గా రికార్డు క్రియేట్ చేయనుంది.

ఇటీవల అమెరికా పర్యటనలో మంత్రి కేటీఆర్.. సంస్థ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. కొత్త పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సాహకాలు, రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక అనుకూలతలను కంపెనీ ప్రతినిధులకు వివరించారు. కేటీఆర్ ప్రజెంటేషన్‌పై లోతుగా పరిశీలించిన బిలిటీ సంస్థ తెలంగాణలో తన ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి త్వరలోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.
ఇప్పటికే పలు అంకుర కంపెనీలు తెలంగాణ గడ్డపై కొలువుదీరాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ రానుంది. దీంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.












Click it and Unblock the Notifications