అంబేద్కర్ విగ్రహానికి మరో గుర్తింపు.!హైరేంజ్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు.!
హైదరాబాద్ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు చేతులు మీదుగా ప్రారంభమైన 125 అడుగుల ఎత్తైన రాజ్యంగా నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి దేశం నలుమూలల నుండి అభినందనల వెల్లువలు అందడంతో పాటు అరుదైన గౌరవం కూడా దక్కుతోంది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున అత్యంత ఎత్తైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నిర్మించినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ దేశ వ్యాప్తంగా ప్రశంసల పరంపర కొనసాగుతోంది. హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం నమోదు అయ్యింది. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తరుపున రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు అందించారు సంస్థ అధికారులు.

హైరెంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం స్థానం పొందటం ఆనందంగా ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అభిప్రాయపడ్డారు. దేశ, విదేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు ప్రసార మాధ్యమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు చెబుతున్నారని వెల్లడించారు. రానున్న రోజుల్లో ప్రపంచ స్థాయిలోనే అంబేద్కర్ విగ్రహం టూరిజం స్పాట్ గా మారుతుందని మంత్రి గుర్తు చేశారు. 125 అడుగుల డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా గుర్తింపు రావడం ఖాయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, న్యూమరాలజిస్ట్ దైవజ్ఞశర్మ, జగిత్యాల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ హరిచరణ్, హైరేంజ్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్స్ డైరెక్టర్స్ శ్రీకాంత్, సుమన్ పల్లె తదితరులు పాల్గొన్నారు.

-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications