వద్దంటే వాన: మరో మూడు రోజులు, సిటీలో వర్ష బీభత్సమే.?
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ముసురు నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో వర్షం పడుతుండటంతో.. జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఇటు చలిగాలులు కూడా వీస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. పలు ప్రాంతాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.

ఎల్లుండి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతుందని చెప్పారు. దానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి మధ్య ట్రోపోస్పియర్ స్థాయి వరకు విస్తరించి ఉందని తెలిపారు.
రాగల 24 గంటల్లో వాయుగుండంగా బలపడనుంది. దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు దగ్గరలోని వాయవ్య దిశగా ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరానికి చేరుకుంటుందని వివరించారు. హైదరాబాద్ సహా తెలంగాణలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తేలికపాటి వానకే హైదరాబాద్ మహానగరం చిత్తడి అయిపోతుంది. రహదారులపైకి నీరు వచ్చి చేరుతుంది












Click it and Unblock the Notifications