హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డార్లింగ్- స్విటీ: బర్త్ డే రోజున అనుష్క స్పెషల్ ట్వీట్.. లవ్ ఎమోజీలు..

|
Google Oneindia TeluguNews

ఇవాళ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే.. ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానుల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డార్లింగ్ బర్త్ డే కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ స్టిల్ బ్యాచిలర్ కావడం.. అనుష్క శెట్టితో కాస్త క్లోజ్‌గా ఉండటంతో వారిద్దరీ మధ్య ఏమైనా ఉందా అనే చర్చ చాలా సార్లు జరిగింది. కానీ తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ చెప్పేశారు. ఈ సారి కూడా స్వీటీ అనుష్క.. డార్లింగ్‌కు విష్ చేశారు. కానీ ఆ ట్వీట్ మాత్రం కాస్త స్పెషల్‌గా ఉంది.

హిట్ పెయిర్

హిట్ పెయిర్

డార్లింగ్‌తో హిట్ పెయిర్‌గా గుర్తింపు ఉన్న బ్యూటీ స్వీటీ అనుష్క.. ప్రత్యేకంగా విష్ చేశారు. ప్రభాస్‌పై తన మనసులో ఉన్న ఆప్యాయతను ట్వీట్ రూపంలో ఫ్యాన్స్ తో పంచుకుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి విషయంలో ప్రభాస్ బెస్ట్‌గా ఉండాలని స్వీటీ కోరుకుంది. అతని సినిమాలు విజయవంతం కావాలని.. అందరి హృదయాలను ప్రభాస్ గెలుచుకోవాలని ఆకాంక్షించింది. ఈ ట్వీట్ నిజంగా స్పెషల్.. అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అనుష్కకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుతున్నారు.

లవ్ ఎమోజీ

థాంక్స్ స్విటీ అంటూ లవ్ ఎమోజీలు పంపిస్తున్నారు. నిజంగానే వారి మధ్య లవ్ ఉందా అని అనే రీతిలో ట్వీట్స్ చేస్తున్నారు. లవ్ ఎమోజీ ట్వీట్స్ మాత్రం ఎక్కువగా చేస్తున్నారు. బర్త్ డే వేళ ప్రభాస్‌కు ఇదీ నిజంగా బెస్ట్ విషెస్.. కానీ ఏదో ఉందనేలా స్వీట్ కామెంట్స్ చేసింది. దాని గురించి మాత్రం చర్చ జరుగుతుంది. వారిద్దరు నిజంగా ఫ్రెండ్సేనా.. లేదంటే ఇంకెదైనా ఉందా అనే అనుమానం కలుగుతుంది.

ఫ్రెండ్స్

ఫ్రెండ్స్

ప్రభాస్, అనుష్క జోడీ.. ఆన్ స్క్రీన్‌లో హిట్ పెయిర్ అనే సంగతి తెలిసిందే. ఆఫ్ స్క్రీన్‌లో ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఇదీ చాలా సందర్భాల్లో ఇరువురు చెప్పారు. కానీ సోషల్ మీడియా పుణ్యం అని రూమర్లు మాత్రం ఆగడం లేదు. కానీ వారిద్దరూ మాత్రం స్నేహానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇద్దరూ కలిసి బిల్లా, మిర్చి, బాహుబలి ద బిగినింగ్, బాహుబలి కన్ క్లూజన్ సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తాము స్నేహితులం అని చెబుతుంటే.. లైఫ్ షేర్ చేసుకోవాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. అందుకే లవ్ ఎమోజీ పెట్టీ చర్చకు తెరతీస్తున్నారు.

English summary
actress anushka special wishes to actor prabhas for his birthday. fans sends love emojis to anushka tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X