ట్రాన్స్‌జెండర్‌ను వదలని మృగాళ్లు... !

దిశ అత్యచారం, హత్య తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు అందోళనలు మొదలయ్యాయి. దీంతో అటు పోలీసులు ఇటు న్యాయవ్వవస్థలు అప్రమత్తమయ్యాయి. దీంతో చిన్నారులు, మహిళలకు వ్యతిరేకంగా ఏ చిన్న సంఘటన జరిగినా...వెంటనే స్పందిస్తున్నాయి.. అయినా... నగరంలోని కొంతమంది మృగాళ్లలో మాత్రం ఎలాంటీ జంకులు మాత్రం కనిపించడం లేదు. వారిపై అత్యచారాలు కొనసాగుతున్నాయి...ఈ నేపథ్యంలోనే నగరంలోని ఎక్కడో ఓ చోట మహిళలపై హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు.

తాజాగా ట్రాన్స్‌జెండర్‌‌ను కూడ వదిలిపెట్టలేదు ఓ మృగాడు. తెలిసిన వాడని ఆటోలో వెళితే... ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. ఈ నేపథ్యంలోనే రెచ్చిపోయిన ఆటోడ్రైవర్ తనపై అత్యచారానికి పాల్పడ్డాడని ట్రాన్స్‌జెండర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి ప్రాంతంలో తనపై అత్యాచారం జరిగిందని, అయితే అటోడ్రైవర్ భారీ నుండి తాను తప్పించుకు వచ్చానని తెలిపింది.

auto driver tried to Rape on Transgender

కాగా ఈసంఘటనకు పాల్పడిన ఆటో డ్రైవర్‌ను తోటి ట్రాన్స్‌జెండర్లతో కలిసి పోలీసులకు అప్పగించింది. దీంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే అత్యాచారం చేసిన ఆటోడ్రైవర్ ఆమెకు గతంలో పరిచయం ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

కాగా మంగళవారం కూడ మేడ్చల్‌లో ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ విద్యార్థినిపై ల్యాబ్ ఇంచార్జ్‌గా పని చేస్తున్న వ్యక్తి అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే.. మరోవైపు లాలాపేట్‌లో ఓ బిచ్చగత్తెను కూడ దుండగులు వదలలేదు. ఇలా దిశ సంఘటన జరిగిన తర్వాత కూడ నగరంతో పాటు రాష్ట్రంలో కూడ మహిళలు, చిన్నపిల్లలపై అత్యాచారాలు జరగడంతో పాటు చివరకు ట్రాన్స్ జెండర్‌‌పై కూడ అత్యాచారాలు జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+