హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో వింత శిశువు - చేప ఆకారంలో పుట్టిన బిడ్డ -mermaid syndrome వల్లేనన్న డాక్టర్లు

|
Google Oneindia TeluguNews

ఆక్వామ్యాన్, జలకన్య, సాగరకన్య ఇలా ఉంటారంటూ కొన్ని సినిమాల్లో చేపరూపంలోని మనుషుల్ని చూశాం కదా, నిజ జీవితంలోనైతే అలాంటి పరిస్థితి మెర్మైడ్ సిండ్రోమ్ అనే ఓ అరుదైన వ్యాధి వల్ల కలుగుతుంది. హైదరాబాద్ లో తాజాగా ఆ వ్యాధితో పుట్టిన బిడ్డ తాలూకు వివరాలు వింత శిశువు అంటూ ప్రచారంలోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

మోదీ, పవన్‌కు 'మాస్టర్' స్ట్రోక్ - విశాఖ ఉక్కు ఉద్యమానికి చిరంజీవి మద్దతు -సంచలన ప్రకటన, పూర్తి పాఠంమోదీ, పవన్‌కు 'మాస్టర్' స్ట్రోక్ - విశాఖ ఉక్కు ఉద్యమానికి చిరంజీవి మద్దతు -సంచలన ప్రకటన, పూర్తి పాఠం

చేప ఆకారంలో శిశువు..

చేప ఆకారంలో శిశువు..

హైదరాబాద్ లో ప్రముఖ ప్రసూతి కేంద్రంగానూ పేరుపొందిన పేట్లబురుజు ఆస్పత్రి(హైకోర్టు సమీపంలో)లో వింత శిశువు జ‌న్మించింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ గ‌ర్భిణికి నెల‌లు నిండ‌టంతో.. పేట్ల‌బురుజు ఆస్ప‌త్రిలో చేరి, బుధవారం సాయంత్రం బిడ్డను ప్ర‌స‌వించింది. అయితే, కాళ్లు రెండు పూర్తిగా కలిసిపోయి, చేప ఆకారంలో ఉన్న బిడ్డ‌ను చూసి వైద్య సిబ్బంది ఆశ్చ‌ర్య‌పోయారు.

పుట్టిన రెండు గంటలకే మృతి..

పుట్టిన రెండు గంటలకే మృతి..

ఆ శిశువు న‌డుము పైభాగం వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. కింది భాగం చేప ఆకారాన్ని పోలి ఉంది. జ‌న‌నేంద్రియాలు, కాళ్లు అభివృద్ధి చెంద‌లేదు. ఆస్పత్రిలో పనిచేస్తున్న సీనియర్ డాక్టర్లు సైతం ఆ నవజాత శిశువును పరిశీలించి, మెర్మైడ్ సిండ్రోమ్ వల్ల ఇలా జరిగిందనే నిర్ధారణకు వచ్చారు. పుట్టిన రెండు గంటల్లోపే పాపాయి ప్రాణాలు కల్పోయింది. ప్ర‌స్తుతం త‌ల్లి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు డాక్ట‌ర్లు పేర్కొన్నారు. ‌

అరుదైన మెర్మైడ్ సిండ్రోమ్

అరుదైన మెర్మైడ్ సిండ్రోమ్

వైద్య పరిభాషలో మెర్మైడ్ సిండ్రోమ్ అనేది ఒక తీవ్రమైన పరిస్థితి. 10లక్షల మంది శిశువుల్లో ఒకరికి మాత్రమే ఇలాంటి పరిస్థితి తలెత్తుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిల్లల కాళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా కలిసిపోతాయి. అత్యంత అరుదైన ఈ మెర్మైడ్ సిండ్రోమ్ తలెత్తడానికి గల కారణాలను ఇంకా గుర్తించలేదు. పాక్షికంగా కాళ్లు అతుక్కుని పుట్టిన శిశువులను డాక్టర్లు కాపాడిన ఘటనలు కూడా చాలా అరుదే. హైదరాబాద్ శిశువు విషయంలో మాత్రం ఆపరేషన్ కు వీల్లేకుండా కాళ్లు పూర్తిగా అతుక్కుపోయి ఉండటం గమనార్హం.

కాబోయే 'సీఎం షర్మిల': వరంగల్ నేతల నినాదాలు -కేసీఆర్‌పై విమర్శలు -జయశంకర్‌కు నివాళికాబోయే 'సీఎం షర్మిల': వరంగల్ నేతల నినాదాలు -కేసీఆర్‌పై విమర్శలు -జయశంకర్‌కు నివాళి

English summary
The doctors at the Petlaburj Maternity Hospital in Hyderabad delivered a baby with a rare congenital condition called mermaid syndrome. The birth took place at 7 PM on Wednesday. Unfortunately, within two hours of the delivery, the infant died due to severe malformations. Scientifically, the rare condition is called Sirenomelia wherein the lower spine and limbs are fused into one another.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X