Baby movie :బాత్ రూమ్‌లో ఆ పని చేస్తూ అమ్మకు దొరికిపోయా..'బేబీ' హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!
లేటెస్ట్ మూవీ 'బేబీ' మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. చిన్ని సినిమాగా వచ్చిన 'బేబీ' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి హీరో, హీరోయిన్లుగా నటించారు జులై 14న విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. రూ 7.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన 'బేబీ' , 80 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి స్టార్ హీరోలకు దిమ్మతిరిగే షాకిచ్చింది.
ఓ అమ్మాయి ఒకే సమయంలో ఇద్దరు అబ్బాయిలను ప్రేమించడం అనే పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ప్రేమించిన వారిని అమ్మాయి ఎలా మోసిందో 'బేబీ' సినిమాలో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. వాస్తవరూపానికి దగ్గరగా ఉండటంతో బేబీ సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాపై స్టార్ హీరోలు సైతం ప్రశంసలు వర్షం కురింపించారు. 'బేబీ'తో హీరోయిన్ వైష్ణవి సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.

ఇదిలా ఉంటే తన జీవితంలో ఎదురైనా ఓ సంఘటన గురించి హీరోయిన్ వైష్ణవి ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ..నాకు ఓ సినిమాలో చిన్న రోల్ చేసే అవకాశం దక్కింది. షూటింగ్ సమయంలో డ్రెస్ ఛేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. చిన్న చిన్న ఆర్టిస్టులకు డ్రెస్ మార్చుకోవాడానికి కారవ్యాన్ అంటూ ఉండదు. కారవ్యాన్ ఉన్న ఓ సీనియర్ యాక్టర్ దగ్గరకు వెళ్లి.. మేడం మీ కారవ్యాన్‌లో డ్రెస్ మార్చుకుంటాం అని అడిగితే..ఆమె కోప్పడి. బాగా తిట్టారని వైష్ణవి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఒకరోజు బాత్ రూమ్‌లోనే కాస్ట్యూమ్స్ ఛేంజ్ చేసుకోవడం మా అమ్మ చూసి చాలా బాధపడింది. ఏడ్చేసి మనకు ఇదింతా అవసరమా,యాక్టింగ్ వద్దు ఏమి వద్దు వదిలేయ్ అని చెప్పి బాధపడింది. ఈ సంఘటనే తనలో కసి పెంచిందని, అప్పుడే జీవితంలో ఏదైనా సాధించాలని ఫిక్స్ అయ్యానని వైష్ణవి అన్నారు. కట్ చేస్తే వైష్ణవి ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. 'బేబీ' దర్శకుడు సాయి రాజేష్‌తో ఆమె మరో మూడు సినిమాలకు సైన్ చేసింది. వీటితో పాటు అల్లు శిరీష్‌తో జంటగా ఓ సినిమాకు వైష్ణవి కమీట్ అయినట్టుగా తెలుస్తుంది.












Click it and Unblock the Notifications