1994లో 450.. ఇప్పుడేమో లక్షలు.. బాలాపూర్ లడ్డు ప్రస్థానం ఇలా
హైదరాబాద్ : తెలంగాణలో వినాయక నవరాత్రులు అంటే మొదట గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ పెద్ద గణేశుడు. ఆ వెంబడి యాదికొచ్చేది బాలాపూర్ గణేశ్. వినాయక చవితి ఉత్సవాల్లో లడ్డు వేలం పాట ప్రక్రియకు తొలుత నాంది పలికింది బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి. అలా ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్న ఘనత బాలాపూర్ సొంతం. 1994లో ప్రారంభమైన బాలాపూర్ లడ్డు వేలం ప్రక్రియ ఇప్పటికీ నిర్విరామంగా కొనసాగుతోంది. తొలినాళ్లలో 450 రూపాయలు పలికిన లడ్డు ధర ఏ ఏటికాయేడు అధిక ధర పలుకుతోంది. అలా ఈసారి 17 లక్షల 60 వేల రూపాయల ధర పలికి గతేడాది రికార్డ్ బ్రేక్ చేసింది. బాలాపూర్ లడ్డు వేలం ప్రస్థానంపై వన్‌ఇండియా తెలుగు స్పెషల్ స్టోరీ.
Recommended Video

స్టేట్ లెవెల్ ఫేమస్.. అందరూ ఆసక్తిగా
బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే లడ్డు వేలం పాట రాష్ట్రవ్యాప్తంగా ఫేమస్ అయింది. గణేశ్ నవరాత్రుల చివరి రోజు అందరి దృష్టి సాధారణంగా ఖైరతాబాద్ మహా గణపతితో పాటు బాలాపూర్ గణేశుడిపై ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అక్కడ జరిగే లడ్డు వేలం పాటపై ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈసారి లడ్డు ధర ఎంత పలకనుంది అని ఇంట్రెస్టింగ్‌గా టీవీలకు అతుక్కుపోయి మరీ చూస్తారు.
ఎప్పటిలాగే ఈసారి కూడా బాలాపూర్ లడ్డు యాక్షన్ ఉత్కంఠభరితంగా సాగింది. 28 మంది పాల్గొన్న వేలం పాటలో చివరకు కొలన్ వంశీయులు లడ్డును దక్కించుకున్నారు. గతేడాది రికార్డును బ్రేక్ చేస్తూ ఈసారి 17 లక్షల 60 వేల రూపాయలు పలికింది. పోటాపోటీగా సాగిన వేలం పాటలో చివరకు కొలన్ రాంరెడ్డి బాలాపూర్ లడ్డును దక్కించుకున్నారు.

ఈసారితో 26 సంవత్సరాలు.. అప్పుడు 450.. ఇప్పుడేమో
బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వేలం పాట ఈసారి 26 సంవత్సాలు పూర్తి చేసుకుంది. ఏ ఏటికాయేడు ప్రత్యేకతను సంతరించుకుంటూ బాలాపూర్ లడ్డు అధిక ధర పలుకుతోంది. 1994లో 450 రూపాయల ధర పలికిన లడ్డు ప్రస్తుతం లక్షల రూపాయలకు చేరింది. ఆ క్రమంలో ఈసారి 17 లక్షల 60 వేల రూపాయల ధర పలికింది. కొలన్ రాంరెడ్డి అధిక ధరకు యాక్షన్ పాడి లడ్డును దక్కించుకున్నారు. పోయినేడాది శ్రీనివాస్ గుప్తా 16 లక్షల 60 వేల రూపాయలకు సొంతం చేసుకున్నారు. 2017లో నాగం తిరుపతి రెడ్డి 15 లక్షల 60 వేల రూపాయలకు వేలం పాడారు. ఈ మూడేళ్లల్లో ప్రతిసారి లక్ష రూపాయలు మాత్రమే అధిక ధర పలుకుతుండటం గమనార్హం.

కొలన్ వంశస్థులదే హవా.. ఈసారి తొమ్మిదోసారి
ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొందరు వేలం పాటలో పాల్గొనడం విశేషం. నెల్లూరు, కర్నూలు ప్రాంతానికి చెందినవారు బాలాపూర్ లడ్డూ వేలంలో పాల్గొన్నారు. 1994లో 450 రూపాయలతో ప్రారంభమైన బాలాపూర్ లడ్డు ప్రస్థానం ఏ ఏటికాయేడు అధిక ధర పలుకుతోంది. అయితే కొలన్ వంశస్థులు ఈసారి దక్కించుకోవడం తొమ్మిదోసారి. 2 కిలోల వెండి గిన్నెలో 21 కిలోల బరువు తూగే లడ్డును 17 లక్షల 60 వేల రూపాయలకు వేలం పాడి కొలన్ రాంరెడ్డి దక్కించుకున్నారు.

18 ఏళ్ల తర్వాత స్థానికేతరులు.. 2012లో తొలిసారిగా
ఈ లడ్డును సొంతం చేసుకుంటే తమకు అంతా మంచే జరుగుతుందనేది భక్తుల నమ్మకం. ఆ లడ్డును బంధుమిత్రులకు ప్రసాదంగా పంచడంతో పాటు తమ పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయని విశ్వసిస్తారు. 1994 నుంచి 2011 వరకు అంటే 18 సంవత్సరాలు స్థానికులే లడ్డును సొంతం చేసుకున్నారు. 2012లో తొలిసారిగా స్థానికేతరుడు పన్నాల గోవర్దన్ రెడ్డి 7 లక్షల 50 వేల రూపాయలకు లడ్డు దక్కించుకున్నారు. అలా అడపాదడపా స్థానికేతరులు వేలం పాటలో పాల్గొని అధిక ధర వెచ్చించి లడ్డును పొందుతున్నారు.

బాలాపూర్ లడ్డు అధరహో.. ఏ సంవత్సరం ఎంతంటే..!
| సంవత్సరం | ధర | దక్కించుకున్నవారు |
| 1994 | 450.00 | కొలన్ మోహన్ రెడ్డి |
| 1995 | 4,500.00 | కొలన్ మోహన్ రెడ్డి |
| 1996 | 18,000.00 | కొలన్ కృష్ణారెడ్డి |
| 1997 | 28,000.00 | కొలన్ కృష్ణారెడ్డి |
| 1998 | 51,000.00 | కొలన్ మోహన్ రెడ్డి |
| 1999 | 65,000.00 | కళ్లెం ప్రతాప్ రెడ్డి |
| 2000 | 66,000.00 | కళ్లెం అంజిరెడ్డి |
| 2001 | 85,000.00 | రఘునందన్ చారి |
| 2002 | 1,05,000.00 | కందాడ మాధవరెడ్డి |
| 2003 | 1,55,000.00 | చిగురింత బాల్ రెడ్డి |
| 2004 | 2,01,000.00 | కొలన్ మోహన్ రెడ్డి |
| 2005 | 2,08,000.00 | ఇబ్రహమ్ శేఖర్ |
| 2006 | 3,00,000.00 | చిగురింత తిరుపతి రెడ్డి |
| 2007 | 4,15,000.00 | రఘునందన్ చారి |
| 2008 | 5,07,000.00 | కొలన్ మోహన్ రెడ్డి |
| 2009 | 5,10,000.00 | సరిత |
| 2010 | 5,35,000.00 | కొడాలి శ్రీధర్ బాబు |
| 2011 | 5,45,000.00 | కొలన్ బ్రదర్స్ |
| 2012 | 7,50,000.00 | పన్నాల గోవర్దన్ రెడ్డి |
| 2013 | 9,26,000.00 | తీగల కృష్ణారెడ్డి |
| 2014 | 9,50,000.00 | సింగిరెడ్డి జైహింద్ రెడ్డి |
| 2015 | 10,32,000.00 | కళ్లెం మదన్ మోహన్ రెడ్డి |
| 2016 | 14,65,000.00 | స్కైలాబ్ రెడ్డి |
| 2017 | 15,60,000.00 | నాగం తిరుపతి రెడ్డి |
| 2018 | 16,60,000.00 | శ్రీనివాస్ గుప్తా |
| 2019 | 17,60,000.00 | కొలన్ రాంరెడ్డి |
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం











Click it and Unblock the Notifications