చరిత్రాత్మక పద్దు, కొడుకును సీఎం చెద్దామనుకుంటున్నాడు.. కేసీఆర్‌పై బండి ఫైర్
బడ్జెట్ గురించి అధికార పార్టీ నేతలు ఆహా ఓహో అంటున్నారు. బాగుంది అని ప్రశంసిస్తున్నారు. ఇక విపక్షాల సంగతి గురించి అయితే చెప్పక్కర్లేదు. పాత చింతకాయ పచ్చడి అంటూ విరుచుకుపడుతున్నారు. బడ్జెట్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. దేశానికి విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన బడ్జెట్ అందించారని అన్నారు. ప్రధాని మోగీ, ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు. కరోనా సమయంలో పన్నులు పెంచి ప్రజల నడ్డి విరుస్తారని మేధావులు, ఆర్థికవేత్తలు ఆవేదన చెందారని చెప్పారు. ట్యాక్స్ ఫ్రీ బడ్జెట్ ప్రవేశపెట్టడం సంతోషకరం అన్నారు .
నిర్మలా సీతారామన్, ప్రధాని మోడీ దేశం కోసం జీవితాలను ధారపోస్తున్నారని వివరించారు. పైసా అవినీతి లేకుండా అహర్నిశలు పని చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. బడ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలపై బండి సంజయ్ స్పందించారు. కేసీఆర్ విమర్శలను బండి సంజయ్ ఖండించారు. దళితుడు కాబట్టే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారని అన్నారు. కేసీఆర్.. దళిత వ్యతిరేకి అని విమర్శించారు. రాష్ట్రపతి దళితుడు కాబట్టే ఆయన ప్రసంగాన్ని బహిష్కరించారని అన్నారు.

తన కుమారుడిని సీఎం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడు అని ఆరోపించారు. కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం అని హెచ్చరించారు. బడ్జెట్ లో రైతుల ప్రస్తావన లేదని కేసీఆర్ అంటున్నారు. ఎంఎస్ ఫీ కోసం ఈ ఏడాది రూ.2 లక్షల 37వేల కోట్లు.. గోధుములు, ధాన్యం కొనడానికి మాత్రమే బడ్జెట్‌లో పెట్టారని చెప్పారు. ఇది రైతుల బడ్జెట్ కాదా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.
Recommended Video
తెలంగాణలో రైతులు కోటీశ్వర్లు అయితే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారో చెప్పాలన్నారు. కేంద్రానికి ధాన్యం కొనే ఆలోచన లేకుండా ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఎందుకు కేటాయిస్తుందని కేసీఆర్‌ని అడిగారు. 317 జీవో పేరుతో ఉద్యోగులను కేసీఆర్ అవమానిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. 317 జీవో మంచిదైతే 10 మంది ఉద్యోగులు ఎందుకు సూసైడ్ చేసుకుంటారని నిలదీశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని కేసీఆర్ అనడం పచ్చి అబద్దం అన్నారు. కొత్త ఉద్యోగాలిస్తానని ఎన్నికల సమయంలో ఊరిస్తున్నారు తప్ప నోటిఫికేషన్లు ఏవి? అని అడిగారు.












Click it and Unblock the Notifications