భాగ్యలక్ష్మీ టెంపుల్ నుంచి పాదయాత్ర షురూ, హుజురాబాద్‌లో ఎండింగ్: బండి సంజయ్

బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ చేపట్టబోయే పాదయాత్ర తేదీ కన్ఫామ్ అయ్యింది. వచ్చేనెల 9వ తేదీ నుంచి పాదయాత్ర చేపడుతానని ఆయనే ప్రకటించారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేస్తానని తెలిపిన సంగతి తెలిసిందే. బండి సంజయ్ కూడా ఇదివరకే ప్రకటన చేశారు. ఇవాళ తేదీని ప్రకటించారు. దీంతో తెలంగాణ గట్టు మీద పాదయాత్రల ద్వారా ప్రజల సమస్యలను నేతలు తెలుసుకోబోతున్నారు.

పాదయాత్ర షూరు..

పాదయాత్ర షూరు..

హైదరాబాద్‌లో గల భాగ్యలక్ష్మి టెంపుల్‌ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని బండి సంజయ్ స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. హుజురాబాద్‌లో తన పాదయాత్రను ముగించబోతున్నానని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసమే పాదయాత్ర చేపడుతున్నానని బండి సంజయ్ వివరించారు. ఇటు జల వివాదంపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రణాళిక ప్రకారమే ఇద్దరు సీఎంలు సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నారని అన్నారు.

కేసీఆర్ రాజీ..

కేసీఆర్ రాజీ..

హుజురాబాద్‌లో రాజకీయ లబ్ధి కోసమే జగన్‌తో కేసీఆర్ రాజీపడ్డారని విమర్శించారు. కృష్ణానది జలాలు ఫిఫ్టీ ఫిఫ్టీ అని కేసీఆర్ రాసిన లేఖ బూటకం అన్నారు. కేసీఆర్ తీరు వలనే తెలంగాణకు 575 టీఎంసీల రావాల్సిన చోట 299 టీఎంసీలకు పరిమితం చేశారన్నారు. కేసీఆర్ ఎన్ని కోట్లు పెట్టినా.. హుజురాబాద్‌లో గెలిచేది ఈటల రాజేందర్ మాత్రమేనన్నారు. చాలా ఈజీగా బీజేపీ హుజురాబాద్‌లో గెలవబోతోందని జోస్యం చెప్పారు. దుబ్బాక మాదిరిగానే బీజేపీ ఉత్సాహంగా పనిచేస్తోందని కామెంట్ చేశారు. ఒకటి, రెండు ఎన్నికల్లో ఓడినంత మాత్రానా వెనకడుగు వేసినట్లు కాదని, కేంద్ర పథకాలను తెలంగాణ ప్రభుత్వం హైజాక్ చేస్తోందని విమర్శించారు.

 అంతకుముందు లేదే..

అంతకుముందు లేదే..

హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత సాధికారత సమావేశాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో దళితులకు రక్షణ కరువని పేర్కొన్నారు. దళితులకు ముఖ్యమంత్రి పదవీ, మూడెకరాల భూమి, 125 అడుగల అంబేడ్కర్ విగ్రహం ఎక్కడ అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2500 కోట్లు ఎక్కడికీ వెళ్ళాయో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఉచిత వ్యాకిన్, రేషన్ బియ్యం కేంద్రం ప్రభుత్వం ఇస్తున్నా ప్రధాని మోదీ ఫోటో‌ను పెట్టడం లేదని విరుచుకుపడ్డారు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో సిబ్బంది లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. అయినా కేసీఆర్ ప్రభుత్వానికి జనం గోస పట్టదని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+