బండి పాదయాత్ర కన్ఫామ్.. 28వ తేదీ నుంచే
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర తేదీ ఖరారయ్యింది. ఇదివరకు రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నెల 24 నుంచి ప్రజా సంగ్రామ యాత్ర చేస్తానని ప్రకటించారు.ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్ మరణం వల్ల కార్యక్రమాలు రద్దు చేసుకున్నట్టు బండి సంజయ్ ప్రకటించారు. పార్టీ పరంగా ఆరు రోజులు సంతాప దినాలు పాటిస్తున్నట్లు పేర్కొన్నారు.
28వ తేదీ నుంచి బండి సంజయ్ పాదయాత్ర చేస్తారు. తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలు, ప్రధాన కార్యదర్శులతో సమావేశం తర్వాత బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మరణంతో ఈ నెల 24వరకు సంతాప దినాలను బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించింది. దీంతో 24న ప్రారంభంకావాల్సిన బండి సంజయ్ పాదయాత్ర వాయిదా వేస్తున్నట్లు ఆదివారం మధ్యాహ్నం తెలిపారు. ముఖ్యనేతలు, ప్రధాన కార్యదర్శులతో సమావేశం తర్వాత బండి సంజయ్ పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఈమేరకు ఆగస్టు 28న భాగ్యలక్ష్మీ దేవాలయం నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభంకానుంది.

వాస్తవానికి బండి సంజయ్ ఆగస్ట్ 9న పాదయాత్ర ప్రారంభించాలని అనుకున్నారు. అయితే పార్లమెంట్ సమావేశాలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద్ యాత్ర నేపథ్యంలో దీనిని వాయిదా వేశారు. ఈ నెల 24 నుంచి పాదయాత్ర చేపట్టాలని ఫిక్స్ అయ్యారు. దీంతో బీజేపీ శ్రేణులు పాదయాత్ర కోసం ఏర్పాటు చేస్తున్నాయి. ఈ యాత్ర విజయవంతం కోసం పార్టీకి చెందిన పలు కమిటీలు పనిచేస్తున్నాయి.వివిధ కారణాలతో బండి సంజయ్ పాదయాత్ర రెండు సార్లు వాయిదా పడింది. ఇదీ బీజేపీ క్యాడర్‌ను నిరుత్సాహ పరిచింది. ఈ నెల 28వ తేదీ నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభిస్తారు.
Recommended Video
ఇటు బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. 'ప్రజా జీవన యాత్ర' పేరుతో హుజూరాబాద్ నియోజకవర్గంలో గల కమలాపూర్ మండలం బత్తినవారిపల్లి నుంచి ప్రారంభం అయ్యింది. నియోజకవర్గంలో వివిధ గ్రామాల మీదుగా 23 రోజుల పాటు ఈటల పాదయాత్ర చేయాల్సి ఉంది. మొత్తం 107 గ్రామపంచాయితీల పరిధిలోని 127 గ్రామాల్లో.. 270 కిలోమీటర్లు ఈటల రాజేందర్ పాదయాత్ర చేయాలి.. కానీ అస్వస్థత కారణంగా పాదయాత్రకు మధ్యలోనే బ్రేక్ పడింది. మరోవైపు మోకాలికి ఆపరేషన్ జరిగింది. దీంతో వైద్యులు పాదయాత్ర చేయొద్దని సూచించారు. దీంతో ఆయన పాదయాత్రకు శాశ్వతంగా బ్రేక్ పడినట్టే అవుతుంది. దీనిపై ఈటల అండ్ కో ప్రకటన చేయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications