మహిళలంటే లెక్కేలేదు.. అందుకే గవర్నర్‌పై విమర్శలు, బండి సంజయ్ విమర్శలు

గవర్నర్ తమిళి సై చేసిన కామెంట్స్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు రేపింది. తమిళి సై అలా అన్నారో లేదో.. వెంటనే మంత్రులు రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ రంగంలోకి దిగారు. టీఆర్ఎస్ నేతల తీరును తప్పుపట్టారు. వారికి ఎవరినీ గౌరవించడం రాదు అని కామెంట్ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని గౌరవించరు.. అలాగే మహిళలకు కూడా రెస్పాక్ట్ ఇవ్వరు అని ఫైరయ్యారు.

అవమానాలకు గురిచేసి..

అవమానాలకు గురిచేసి..

మూడేళ్లుగా అవమానాలను ఎదుర్కొన్నానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిన్న విచారం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ గొర్రెలు.. మహిళలను గౌరవించడం లేదని బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. కల్వకుంట్ల రాజ్యాంగ ప్రతిపాదకుల నుంచి ఇంతకంటే ఇంకేం ఆశించగలం అంటూ సెటైర్లు వేశారు.

పట్టించుకోని వైనం..

పట్టించుకోని వైనం..


భారత రాజ్యాంగ సిద్ధాంతాలను అమలు చేయాలని గవర్నర్ కోరుతున్న పట్టించుకోవడం లేదు. రాజ్ భవన్ వద్ద కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేసినట్టు కాకుండా, ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉండటం నేర్చుకోవాలని బండి సంజయ్ హితవు పలికారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వివక్షను, అస్పృశ్యతను తొలగిస్తుంది, మాట్లాడే హక్కును కల్పిస్తుందని గుర్తుచేశారు.

నిజం మాట్లాడారే..

నిజం మాట్లాడారే..


గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పార్టీలకు అతీతంగా నిజాలే మాట్లాడారని.. కానీ టీఆర్ఎస్ మాత్రం గవర్నర్ పై బీజేపీ ముద్ర వేస్తోందని ఫైరయ్యారు. దీంతో రాష్ట్ర ప్రథమ పౌరురాలిని అవమానిస్తోందని.. ఇది సిగ్గుచేటని బండి సంజయ్ విమర్శించారు.

నారాయణ.. నారాయణ...

నారాయణ.. నారాయణ...

టీఆర్ఎస్- బీజేపీ నేతల అటాక్- కౌంటర్ అటాక్ కొనసాగుతోంది. కానీ మధ్యలో సీపీఐ నారాయణ కూగా స్పందించారు. గవర్నర్ తమిళిసై లక్ష్మణరేఖ దాటారని సీపీఐ నారాయణ కామెంట్ చేశారు. బీజేపీ కార్పొరేట్ విధానాలను గవర్నర్ ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. గవర్నర్ పదవే పనికిమాలినదని ఘాటుగా స్పందించారు. గవర్నర్ ముసుగులో ఉన్న బీజేపీ నేత తమిళిసై అని మండిపడ్డారు. ఆమెను రీకాల్ చేయాలని కోరారు. బీజేపీ నాయకులను గవర్నర్‌ను చేస్తే ఇలానే ఉంటుందని ఫైరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+