కేసీఆర్! దేశంలో ఎక్కడా లేనిది తెలంగాణలోనే ఎందుకు?: బండి సంజయ్

హైదరాబాద్: రాష్ట్రంలోని పోలీసు నియామకాలకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. వెంటనే దేహదారుఢ్యపరీక్షల్లో లోపాలను, అవకతవకలను సవరించి.. వారికి న్యాయం చేయాలని లేఖలో కోరారు.

పోలీస్ అర్హతల అవకతవకలతో 2 లక్షల మంది అభ్యర్థులకు నష్టం

పోలీస్ అర్హతల అవకతవకలతో 2 లక్షల మంది అభ్యర్థులకు నష్టం

తెలంగాణ సర్కారు ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించిన.. దేహధారుడ్య పరీక్షలను నోటిఫికేషన్‭లో పేర్కొన్న దానికి భిన్నంగా నిర్వహించినట్లు అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్పందించిన బండి సంజయ్.. దేహదారుఢ్య పరీక్షల్లోని లోపాలు, అవకతవకలను వెంటనే సవరించాలని కోరుతూ సీఎం కేసీఆర్‭కు లేఖ రాశారు. లాంగ్ జంప్, షార్ట్ పుట్ పరీక్షల్లో నోటిఫికేషన్‭లో చెప్పిన దానికి భిన్నంగా అధికారులు వ్యవహరించడం వల్ల.. దాదాపు 2 లక్షల మంది పురుష, మహిళా అభ్యర్థులు అర్హత సాధించ లేకపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని బండి సంజయ్ పేర్కొన్నారు.

పోలీస్ అభ్యర్థుల అభ్యంతరాలు పట్టించుకోరా?: బండి

పోలీస్ అభ్యర్థుల అభ్యంతరాలు పట్టించుకోరా?: బండి

అర్హుల ఎంపికలోనూ అవకతవకలు జరిగినట్లు కూడా ఫిర్యాదులు వస్తున్నాయని బండి సంజయ్ రాసిన లేఖలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పోలీసు ఉద్యోగాల నియమాక ప్రక్రియ మొదటి నుంచి వివాదాలకు తావిచ్చేలా వ్యవహరిస్తుండటం దురద్రుష్టకరమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రిలిమినరీ పరీక్షల్లో కటాఫ్ మార్కుల విషయంలోనూ.. అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. ప్రభుత్వం పట్టించకోకపోవడం బాధాకరమన్నారు. తాజాగా దేహదారుఢ్య పరీక్షల్లోనూ నోటిఫికేషన్‭కు భిన్నంగా కొత్త నిబంధనలు పెట్టి అభ్యర్థులను డిస్ క్వాలిఫై చేయడం అన్యాయమని బండి ధ్వజమెత్తారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ఎందుకు?: బండి

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ఎందుకు?: బండి


దేశంలోని అనేక రాష్ట్రాల్లోనూ లాంగ్ జంప్ డిస్టన్స్ 3.8 మీటర్లుగానే ఉందని... తెలంగాణలో మాత్రం 4 మీటర్లుగా నిర్ణయించడం వల్ల అభ్యర్థులకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగిందన్నారు బండి సంజయ్. లాంగ్ జంప్‭తో పాటు షాట్ పుట్ విషయంలో పాత విధానాన్ని అమలు చేయాలన్నారు. లాంగ్ జంప్‭లో ఆన్ ది లైన్‭ను కూడా పరిగణలోకి తీసుకోవాలని.. అలాగే ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో తప్పుగా ఇచ్చిన ప్రశ్నలకు గాను అభ్యర్థులందరికీ మార్కులు కలపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తక్షణమే జరిగిన తప్పిదాలను సరిదిద్ది లక్షలాది మంది అభ్యర్థులకు తగిన న్యాయం చేయాలని సీఎం కేసీఆర్ ను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+