బండ్ల గణేశ్‌కు మరోసారి పాజిటివ్.. టాలీవుడ్‌లో కరోనా కలవరం
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిన క్రమంలో పలువురు రాజకీయ నాయకులే కాక సినీ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. కరోనా కేసులు పెరగడంతో ప్రముఖులు వైరస్ బారిన పడ్డారు. ఇవాళ నటుడు రాజేంద్ర ప్రసాద్‌కు పాజిటివ్ వచ్చింది. తర్వాత నిర్మాత బండ్ల గణేశ్ కూడా వైరస్ బారిన పడ్డారు. బండ్ల గణేష్ కూడా మరోసారి కరోనా బారిన పడ్డారు. బండ్ల గణేష్ కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారించారు. బండ్ల గణేష్‌కు ఇది మొదటిసారి కాదు.. గతంలో కూడా కరోనా సోకింది.
ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్‌లో పలువురు ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడ్డారు. బీటౌన్‌లో ఏక్తా కపూర్, అర్జున్ కపూర్, స్వరా భాస్కర్, సింగర్ విశాల్ డడ్లానీతో పాటు టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు కరోనా సోకడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. వీరే కాకుండా త్రిష, వరలక్ష్మీ శరత్ కుమార్, తమిళ నటుడు, నిర్మాత విష్ణు విశాల్‌లకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేశ్ కరోనా బారిన పడ్డారు.

కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. ఈ నెల ఆఖరు.. ఫిబ్రవరిలో భారీగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖులను కూడా కేసులు వదలడం లేదు. హెల్త్ వర్కర్లు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కరోనా సోకుతుంది. ఇటు కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అందుకు తగిన జాగ్రత్తలను తీసుకుంటుంది. ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచాలని అధికారులకు స్పష్టంచేసింది. కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. ఒమిక్రాన్ వైరస్ వాయువేగంతో వ్యాపిస్తోంది. ఒకరికి సోకితే.. ఆ ఫ్యామిలీకి దాదాపుగా వస్తోంది. సన్నిహితంగా మెలిగితే చాలు వైరస్ వస్తోంది.
కరోనా తోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. దేశంలోని 27 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో 3,623 కేసులు నమోదయ్యాయి. ఇక ఒమిక్రాన్ వేరియంట్ వలన ప్రాణాపాయం చాలా తక్కువని, మైల్డ్ సింటమ్స్ మాత్రమే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు.కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. ఈ నెల ఆఖరు.. ఫిబ్రవరిలో భారీగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖులను కూడా కేసులు వదలడం లేదు. హెల్త్ వర్కర్లు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కరోనా సోకుతుంది.












Click it and Unblock the Notifications