బావార్చీ హోటల్ సీజ్, దిద్దుబాటుతో తెరుచుకున్న హోటల్
హైదరాబాద్: భాగ్యనగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో గల బావార్చీ హోటల్‌ను అధికారులు సోమవారం మధ్యాహ్నం సీజ్ చేశారు. ఆ తర్వాత హోటల్ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో కొద్ది గంటల్లోనే తెరుచుకుంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు హోటల్‌ను మధ్యాహ్నం సీజ్ చేశారు. నిర్వాహకులు తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయడం లేదని ఈ చర్యలు చేపట్టారు.

కొంతకాలంగా హోటల్ యాజమాన్యం తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేయడం లేదని, ఆర్గానిక్ వేస్ట్ కన్వర్టర్ మిషన్‌ను పెట్టుకోవాలని సూచించినా స్పందించలేదని, అందుకే సీజ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే హోటల్ యాజమాన్యం ఆర్గానిక్ వేస్ట్ కన్వర్టర్ మిషన్ తీసుకు వచ్చి అమర్చుకోవడంతో పాటు ఇతర చర్యలు తీసుకున్నారు. దీంతో ఆ తర్వాత తెరుచుకుంది.












Click it and Unblock the Notifications