Bigg Boss 3 : బిత్తిరి సత్తి.. తీన్మార్ సావిత్రి కాంబినేషన్ సూపర్.. కానీ ఆమె వ్యక్తిగత జీవితం ?

Recommended Video

    Savitri [Sivajyothi] Reveals Unknown Facts About Her Love Story || Filmibeat Telugu

    హైదరాబాద్ : ఫస్ట్ వీక్ తీసుకొచ్చిన టీఆర్పీ రేటింగులతో బిగ్‌బాస్-3 మరింత వేగంతో దూసుకెళ్తుంది. టాస్క్‌లు, కెప్టెన్సీ కోసం ఫైట్లతో సీజన్‌ను హైప్‌కి తీసుకొచ్చింది. శుక్రవారం కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ తమ జీవితంలో జరిగిన సంఘటనలను పంచుకోవాలని కోరారు. అయితే అందరూ తమ జీవితంలో జరిగిన ఘట్టాలను గుర్తుచేసుకున్నారు. దాదాపు కంటెస్టెంట్ల అంతా తమ విషాద గాథను చెప్పి బోరుమని ఏడ్చేశారు. ఒకరిద్దరూ మాత్రం బిగ్ బాస్‌లో పేరుకుపోయిన భావోద్వేగాన్ని కాస్త ఉత్సాహపరిచేందుకు జాలీ ఘటనలను షేర్ చేసుకున్నారు. ఇక మన సావిత్రి .. అదేనండి శివజ్యోతి తన జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాన్ని గుర్తుచేసుకొని కనుపాపల నుంచి వస్తోన్న నీటిని ఊబికి పట్టుకొని .. హృదయ స్పందనల్లోంచి వస్తోన్న జ్ఞాపకాలను కంటెస్టెంట్లతో పంచుకున్నారు.

    నవ్వులే కాదు ..

    నవ్వులే కాదు ..

    తీన్మార్ సావిత్రి.. తన తమ్ముడు.. అదే బిత్తిరి సత్తితో సరదాగా ఉండే శివజ్యోతి జీవితం తెరిచిన పుస్తకం కాదు. ఆమె చాలా కష్టాలు అనుభవించింది. అయితే ప్రేమ విషయంలో ఆమె పోరాటమే చేసింది. అబ్బాయిని వద్దంటే ఊరుకుంది. మాట్లాడకుండా ఉండాలనే అలాగే ఉంది. అయినా ఇంటివారు నమ్మకపోవడంతో .. తనను ప్రాణంలా ప్రేమించిన అబ్బాయి వద్దకొచ్చేసింది. తెరపై నవ్వులు పూయించే సావిత్రి .. తెరవెనుక జీవితం కష్టాలు. ప్రేమ విషయంలో ఆమె సినిమా తరహా అనుభవం ఉంది. నిజజీవితంలో ప్రేమం కోసం పోరాడి .. మనసిచ్చిన వాడిని మనువాడిని జీవితాన్ని గెలుచుకుంది శివజ్యోతి.

     బోరుమని ఏడ్చేశారు ..

    బోరుమని ఏడ్చేశారు ..

    తన జీవితంలో జరిగిన ఘటనను గుర్తుచేసుకొని మరోసారి ఏడ్చేశారు శివజ్యోతి. తాను ఒక్కబ్బాయిని ప్రేమించానని చెప్పి .. అప్పటి ఘటనను గుర్తుతెచ్చుకొని ఏడుస్తూనే జరిగిన ఘటనను తన కంటెస్టెంట్లతో పంచుకున్నారు. తమ ప్రేమ విషయం తెలిసి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదన్నారు. అయితే అన్నీ కుటుంబాలకు భిన్నంగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ ప్రవర్తించారని పేర్కొన్నారు. మిగతా వారు చచ్చిపోతామని బెదిరిస్తారు .. కానీ మా వాళ్లు మాత్రం తాను ప్రేమించిన అబ్బాయిని చంపేస్తామని బ్లాక్ మెయిల్ చేశారని తెలిపారు. తాను మనువిచ్చిన యువకుడిని మరచిపోవాలని తనను కొట్టారని గుర్తుచేశారు. తనకు నాలిక తప్ప ఒళ్లంతా గాయాలేనని అప్పుడు తనను కుటుంబసభ్యులు వేధించిన విషాద ఘటనను పంచుకున్నారు.

    దూరంగా ఉన్నా ..

    దూరంగా ఉన్నా ..

    యువకుడిని ప్రేమిస్తే వద్దన్నారని చెప్పారు. కారణం చెప్పలేదని .. అయినా ఆర్నెళ్లు దూరంగా ఉండాలని కోరారని చెప్పారు. అందుకు తాను సమ్మతించానని .. కానీ ఇంటి సభ్యులే మాట తప్పారన్నారు. ఆరునెలలు ఫోన్‌లో మాట్లాడొద్దని చెబితే .. మాట్లాడకుంటా ఉన్నాన్ని చెప్పారు. కానీ తనకు మాటిచ్చిన అమ్మ వాళ్లే మాట తప్పారని గుర్తుచేశారు. అందుకోసమే తనకు తెలియని ప్రపంచం హైదరాబాద్ వచ్చానని పేర్కొన్నారు. తెలియని రంగుల ప్రపంచంలో అడుగిడానని వెల్లడించారు. చివరికి తనను ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకుంటానని చెబితే .. కుటుంబసభ్యులు మాట నిలబడలే కాబట్టి .. తాను పెళ్లిచేసుకున్నానని చెప్పారు. నేనేం మాట తప్పలే .. అమ్మ వాళ్లే మాట తప్పారు అని భావోద్వేగానికి గురయ్యారు.

    మరవను మీ సాయం ..

    మరవను మీ సాయం ..

    కానీ తనకు అమ్మమ్మ, నాన్న, తమ్ముడు సహకరించారని గుర్తుచేశారు శివజ్యోతి. తనను ఇష్టపడిన అబ్బాయిని పెళ్లిచేసుకునేందుకు వారి సహకరించారని పేర్కొన్నారు. వారికి ఎప్పుడూ తాను రుణపడి ఉంటానని తెలిపారు. తాను విశ్వసించినట్టే మా ఆయన తనను బంగారంలా చూసుకుంటున్నాడని చెప్పుకొచ్చారు. తన నమ్మకాన్ని వమ్ము చేయలేదని .. మహారాణిలా చేసుకుంటున్నారని తెలిపారు. తనకు ఎప్పుడూ రుణపడి ఉంటానని .. ఎప్పుడూ నేను నీ పిల్లనేనని .. లైఫ్‌లో నీకు మరో ఆప్షన్ లేదని తన జీవితంలో జరిగిన ఘట్టాన్ని గుర్తుచేసుకున్నారు సావిత్రి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+