Bigg Boss Telugu:ఎలిమినేషన్‌లో భారీ ట్విస్ట్...ఆ కంటెస్టెంట్‌కు నో ఛాన్స్..నెటిజెన్స్ హ్యాపీ..!

హైదరాబాద్ : బిగ్‌బాస్ తెలుగు ముగింపు దశకు చేరుకుంటోంది. ఈ క్రమంలోనే ఇంటిలో డ్రామా పీక్ స్టేజెస్‌కు చేరుకుంటోంది. ఎవరిగేమ్ వారు ఆడుతూ కంటెస్టెంట్లు గ్రాండ్ ఫినాలే చేరేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇక ఈవారం ఎలిమినేషన్ పై లీకులు వచ్చేశాయి. ఈ వారం ఒకరు ఎలిమినేట్ అవుతారనుకుంటే మరొకరు ఎలిమినేట్ అయ్యారు. ఇంతకీ బిగ్‌బాస్ తెలుగు-4 నుంచి 13వ వారంలో ఎవరు ఎలిమినేట్ కానున్నారు..? లెట్స్ సీ...

 ఎవరు ఎలిమినేట్ అవుతారు

ఎవరు ఎలిమినేట్ అవుతారు

బిగ్‌బాస్ తెలుగు సీజన్ -4 చాలా ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. షో ప్రారంభం అయినప్పటి నుంచి ప్రతి వారంలో ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. గత వారం అవినాష్ ఎలిమినేట్ కావాల్సి ఉన్నప్పటికీ అనూహ్యంగా సేవ్ అయ్యాడు. ఇక ఈవారాంతం ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో లీకులు వచ్చేశాయి. ఈ సారి ఎలిమినేషన్‌కు హారికా, అభిజీత్, మోనాల్, అవినాష్, అఖిల్‌లు నామినేట్ కాగా వీరిలో ఎవరు ఇంటి నుంచి ఎగ్జిట్ అవుతారా అనే చర్చ జోరుగా సాగడంతో పాటు ఆసక్తి కరంగా కూడా మారింది.

 మోనాల్‌ను ఇక సేవ్ చేయదలుచుకోలేదు

మోనాల్‌ను ఇక సేవ్ చేయదలుచుకోలేదు

బిగ్‌బాస్ తెలుగు 13వ వారం ఎలిమినేషన్‌లో ఈ సారి ఇంటి నుంచి ఎగ్జిట్ అయ్యేది మోనాల్‌ అని లేటెస్ట్ అప్‌డేట్. ఇప్పటి వరకు పలు మార్లు మోనాల్ ఎలిమినేట్ అయ్యేందుకు రేస్‌లో నిలిచినప్పటికీ బిగ్‌బాస్ షో నిర్వాహకులు ఆమెను సేవ్ చేస్తూ వస్తున్నారు. ఇవే ఆరోపణలు షో మొదట్లో వచ్చాయి. ప్రతిసారీ మోనాల్ నామినేట్ అవుతుండటం, ఆమెను కాదని షో నిర్వాహకులు ఇంటిలోని స్ట్రాంగ్ కంటెస్టెంట్లను బయటకు పంపుతూ వస్తున్నారు. దీనిపై నెటిజెన్లు కూడా పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు. అదే సమయంలో నాగార్జునను, షో నిర్వాహకులను సైతం సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. అయితే ఈ సారి మాత్రం మోనాల్‌ను సేవ్ చేసేందుకు బిగ్‌బాస్ షో నిర్వాహకులకు కారణాలు దొరకక పోయి ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.

 మోనాల్ కోసం పలువురు ఔట్

మోనాల్ కోసం పలువురు ఔట్

షో ప్రారంభం నుంచే మోనాల్‌పై నెటిజెన్లు నెగిటివ్ ఒపీనియన్‌తో ఉన్నప్పటికీ షో హోస్ట్ నాగార్జున మాత్రం ఆమెను సేవ్ చేస్తూ వస్తున్నారు. కానీ షో చివరి అంకంకు చేరుకుంటున్న నేపథ్యంలో ఇక మోనాల్‌పై కఠినంగా వ్యవహరించక తప్పలేదు. దీంతో మోనాల్ ఇంటి నుంచి ఎగ్జిట్ అయినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు మోనాల్‌ను సేవ్ చేసేందుకు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అయిన దేవీ నాగవల్లి, కుమార్ సాయి, దివి, లాస్య వంటి వారిని షో నుంచి ఎలిమినేట్ చేసి బిగ్‌బాస్ షో నిర్వాహకులు అవవాదు మూటగట్టుకున్నారు. ఇక ఈ సారి ట్విస్ట్ ఏంటంటే అవినాష్‌కు అందరికంటే తక్కువగా ఓట్లు వచ్చినప్పటికీ.. అవినాష్‌ను సేవ్ చేస్తూ మోనాల్‌ను ఇంటినుంచి పంపడం చర్చనీయాంశంగా మారింది.

 అన్నపూర్ణ స్టూడియోస్‌లో మోనాల్ సోదరి హేమాలి

అన్నపూర్ణ స్టూడియోస్‌లో మోనాల్ సోదరి హేమాలి

ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో మోనాల్ సోదరి కనిపించింది. అంటే మోనాల్‌ ఎలిమినేట్ అయ్యిందనే వార్తలకు బలం చేకూరుస్తోంది. మోనాల్‌ను తీసుకెళ్లేందుకు ఆమె సోదరి హేమ వచ్చిందనే లీకులు వస్తున్నాయి. మొత్తానికి మోనాల్ షో నుంచి నిష్క్రమిస్తుండటంతో హౌజ్‌లో గ్లామర్‌కు బ్రేక్ పడటంతో పాటు హౌజ్‌లో ఓ ఎపిసోడ్ కూడా ముగిసిందనే చెప్పాలి. మోనాల్ ఇంటి నుంచి బయటకు వెళ్లడంతో అఖిల్ మరో రెండు వారాల పాటు ఒంటరి వాడవుతాడని సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన మోనాల్‌కు అక్కినేని నాగార్జున తన సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నట్లు ప్రస్తుతం ఫిలింనగర్‌లో జోరుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+