హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాకింగ్: బిగ్‌బాస్ తెలుగు 5 కంటెస్టెంట్.. అరెస్ట్: ఆ యూట్యూబ్ వీడియోలో

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 కంటెస్టెంట్, ప్రముఖ యూట్యూబర్ సరయు అరెస్ట్ అయ్యారు. ఆమెను హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. యుూట్యూబ్‌‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో అరెస్ట్‌కు కారణమైంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా, హిందూయిజాన్ని కించపరిచేలా ఈ వీడియో ఉందంటూ అందిన ఫిర్యాదుల మేరకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఆమెపై 153ఏ, 295ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారు..అరెస్ట్ చేశారు.

సరయు.. బోల్డ్ కామెంట్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటారు. వివిధ అంశాలపై షార్ట్‌ఫిల్మ్స్, ఎపిసోడ్లను చిత్రీకరించి- 7 ఆర్ట్స్ పేరుతో ఏర్పాటు చేసిన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్ చేస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమెకు ఫాలోవర్లు ఉన్నారు. ఆ గుర్తింపుతోనే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 కంటెస్టెంట్‌గా సెలెక్ట్ అయ్యారు. ఆ రియాలిటీ షోలో రాణించలేకపోయారు. తొలివారమే బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఆ తరువాత కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చారు.

గత సంవత్సరం ఫిబ్రవరిలో పోస్ట్ చేసిన ఓ ఎపిసోడ్.. ఇప్పుడు ఆమె అరెస్ట్‌కు దారి తీసింది. ఇందులో సరయు- ఓ రౌడీ గ్యాంగ్ లీడర్‌గా కనిపిస్తారు. గణపతి బొప్పా మోరియా అని రాసివున్న కాషాయరంగ రిబ్బన్‌ను తలకు ధరించి- రౌడీల్లాగా ప్రవర్తిస్తుంటారు. విశ్వహిందు పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలను అనుకరించేలా- ప్రేమికులకు ఎక్కడికక్కడ పెళ్లిళ్లు చేస్తూ ఈ ఎపిసోడ్‌లో నటించారు. ఇది కాస్తా వివాదాస్పదమైంది.

Bigg Boss 5 Telugu Contestant and YouTuber Sarayu Arrested, and shifted to Banjara Hills Police Station

తమను రౌడీల్లా చిత్రీకరించడాన్ని వీహెచ్‌పీ కార్యకర్తలు తప్పుపట్టారు. దీనిపై వారు సిరిసిల్లలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత సిరిసిల్ల పోలీసులు సరయుపై కేసు నమోదు చేశారు. అనంతరం దీన్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదలాయించారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు సరయును అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఎపిసోడ్‌ రచయిత, దర్శకుడు శ్రీకాంత్ రెడ్డిపై కూడా వీహెచ్‌పీ నాయకులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

English summary
Bigg Boss 5 Telugu Contestant and YouTuber Sarayu Arrested, and shifted to Banjara Hills Police Station
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X