Bigg Boss 5 Telugu Voting Results: రామ..రామ: ఓట్లను కొల్లగొడుతున్న ప్లేబ్యాక్ సింగర్: లీస్ట్‌లో ఎవరంటే
హైదరాబాద్: వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5కు సంబంధించిన ఓట్ల ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం మొదలైన ఈ ఓటింగ్ ప్రాసెస్.. మూడోరోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉన్న కంటెస్టెంట్ల భవిష్యత్‌ను డిసైడ్ చేసే ఓటింగ్ షేర్ అది. ఏడు వారాల పాటు హౌస్‌లో కొనసాగిన ఓ కంటెస్టెంట్.. ఈ ఆదివారం ఎలిమినేట్ అవుతారు. తక్కువ ఓట్లు పోల్ అయిన ఆ కంటెస్టెంట్ ఎవరై ఉంటారనే డిబేట్ సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది.

ఎనిమిది మంది నామినేట్..
హౌస్ నుంచి బయటికి వెళ్లే కంటెస్టెంట్లను ఎంపిక చేసే ప్రక్రియ ప్రతి సోమవారం ఉంటుంది. తమకు నచ్చని లేదా స్ట్రాంగ్ కాంపిటిటర్‌గా భావించిన వారిని కంటెస్టెంట్లు నామినేట్ ప్రాసెస్ కోసం సెలెక్ట్ చేస్తుంటారు. టాస్క్‌లల్లో చురుగ్గా ఆడకపోవడం, కుకింగ్ సెక్షన్‌లో కో ఆపరేట్ చేయకపోవడం.. ఇలా చిన్న చిన్న కారణాలతోనూ వారు తమ తోటి కంటెస్టెంట్లను ఎలిమినేషన్ కోసం నామినేట్ చేస్తుంటారనేది చూస్తూనే ఉన్నాం. టవల్ ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటాడనే కారణంతో ప్రియా.. యాంకర్ రవిని ఎలిమినేషన్ కోసం నామినేట్ చేశారు.

మళ్లీ వారే..
ఈ వారం కూడా ఎనిమిదిమంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్ జోన్‌లోకి వచ్చారు. ఆర్జే కాజల్, యాంకర్ రవి, సిరి హన్మంతు, ప్రియా, అనీ మాస్టర్, శ్రీరామచంద్ర, షణ్ముఖ్ జస్వంత్ ఈ వారం నామినేట్ అయ్యారు. సీక్రెట్ హౌస్‌లో ఉంటోన్న లోబో నేరుగా ఎలిమినేషన్స్‌లోకి వస్తాడు. వారిలో ఆర్జే కాజల్ మినహా మిగలిన వారందరూ వరుసగా నామినేట్ అవుతూ వస్తోన్నారు. మరోసారి వారంతా డేంజర్ జోన్‌లో నిలిచారు. ఎలిమినేట్ అయ్యే థ్రెట్‌ను ఎదుర్కొంటున్నారు.

తక్కువ ఓట్లు
రెండు-మూడు వారాలుగా లోబో, ప్రియా, సిరి హన్మంతుకు తక్కువ ఓట్లు పోల్ అవుతున్నాయి. అలాగే- ఇప్పటిదాకా ఎలిమినేట్ అయిన వారిలో అయిదుమంది ఫిమేల్ కంటెస్టెంట్లు ఉన్నారు..ఒక్క నటరాజ్ మాస్టర్ తప్ప. సరయు, ఉమాదేవి, లహరి, హమీదా, శ్వేత వర్మ బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లారు. ఈ వారం కూడా ఎలిమినేషన్ కోసం సెలెక్ట్ అయిన ఎనిమిది మందిలో సగంమంది ఫిమేల్ కంటెస్టెంట్లు ఉన్నారు. ప్రియా, సిరి హన్మంతు, ఆర్జే కాజల్, ఆనీ మాస్టర్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఈ వారం కూడా ఫిమేల్ కంటెస్టెంట్‌పైనే వేటు పడుతుందా? అనే డిబేట్ సోషల్ మీడియాలో సాగుతోంది.

శ్రీరామచంద్ర.. టాపర్‌గా
ప్రస్తుతం కొనసాగుతోన్న ఓటింగ్ ప్రక్రియలో శ్రీరామచంద్ర దుమ్ము లేపుతున్నాడు. అత్యధిక ఓట్లు పడ్డాయి అతనికి. మంగళవారం రాత్రి నాటికి పోల్ అయిన ఓట్ల ప్రకారం చూసుకుంటే.. టాప్ పొజీషన్‌లో కొనసాగుతున్నాడీ ప్లేబ్యాక్ సింగర్. మొత్తం 16,554 ఓట్లు పోల్ కాగా.. అందులో 19.29 శాతం ఓట్లు అతనికి పడ్డవే. 3,193 ఓట్లను శ్రీరామచంద్ర సాధించాడు. రెండోస్థానంలో సిరి హన్మంతు నిలిచారు. ఆమెకు 16.67 శాతంతో 2,759 ఓట్లు పోల్ అయ్యాయి.

మూడో స్థానంలో యాంకర్ రవి..
ఓటింగ్ షేర్‌లో యాంకర్ రవి మూడో స్థానంలో నిలిచాడు. అతనికి 15.47 ఓట్లతో 2461 మేర ఓట్లు పడ్డాయి. జెస్సీ-1989, సీక్రెట్ రూమ్‌లో కాలం వెల్లదీస్తోన్న లోబోకు 1,786 ఓట్లను సాధించారు. చివరి మూడు స్థానంలో ఆర్జే కాజల్, అనీ మాస్టర్, ప్రియా నిలిచారు. ఆర్జే కాజల్-1,425 ఓట్లు పోల్ అయ్యాయి. ఆమెతో సమానంగా 1,425 ఓట్లు అనీ మాస్టర్‌కు పోల్ అయ్యాయి. వారిద్దరికీ పడ్డ ఓట్ల శాతం 8.61. ఇక ప్రియా చిట్టచివరన నిలిచారు. ఆమెకు 1416 ఓట్లు పోల్ అయ్యాయి.
Recommended Video

ఇంకా గడువు..
వీక్షకులు తమకు ఇష్టమైన కంటెస్టెంట్‌ను ఎలిమినేషన్స్ లిస్ట్ నుంచి బయటపడేయడానికి ఇంకా గడువు ఉంది. ఎలిమినేషన్ ప్రాసెస్ మొదలయ్యే సమయానికి ఆయా ఓట్ల సంఖ్యలన్నీ తారుమారు అవుతాయి. ఓట్ల శాతం ఇంకా భారీగా పెరగడం ఖాయం. ఇప్పటి వరకు ఉన్న తాజా పరిస్థితి ప్రకారం చూసుకుంటే ప్రియా, అనీ మాస్టర్, ఆర్జే కాజల్ డేంజర్ జోన్‌లో ఉన్నట్టే. తమకు పోల్ అయిన ఓట్లను భారీగా పెంచుకోవడానికి బిగ్‌బాస్ హౌస్‌లో తమ టాలెంట్‌ను ప్రదర్శించుకోవాల్సి ఉంటుంది. అరటిపండు ఆటలో వీజే సన్నీ.. ఓ గేమ్ ఛేంజర్‌గా నిలిచిన తరహాలో.. టాస్కులను కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications