Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bigg Boss Grand Finale:కింగ్ నాగ్‌తో గ్రాండ్‌గా ప్రారంభం... కనిపించని దేవీ నాగవల్లి ..! అభిజీత్ వైపే..!

హైదరాబాదు: బిగ్‌బాస్ సీజన్ 4... సెప్టెంబర్ 6వ తేదీన ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. దాదాపు వంద రోజులకు పైగా ఎంతో గ్రాండ్‌గా నడిచిన ఈ వన్ అండ్ ఓన్లీ మెగా రియాల్టీ షో... ఆదివారం గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. మొత్తం 19 మంది టైటిల్ కోసం పోటీ పడగా ఒక్కో వారం ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వచ్చారు. తొలివారంలో సూర్యకిరణ్ ఎలిమినేట్ కాగా చివరిగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ మోనాల్. ఇక గ్రాండ్ ఫినాలేకు ఐదుగురు కంటెస్టెంట్స్ చేరారు. ప్రేక్షకులు కూడా ఎపిసోడ్‌ ఎపిసోడ్‌కు చాలా ఆసక్తి చూపారు. ఇక గ్రాండ్ ఫినాలేలో ప్రేక్షక దేవుళ్లు అభిజీత్ వైపే మొగ్గు చూపినట్లు సమాచారం.

గ్రాండ్ ఫినాలే కింగ్ నాగార్జున ఎంట్రీతో ప్రారంభమైంది. ఆ తర్వాత ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు మంచి ఊపున్న సాంగ్స్‌తో ఎంట్రీ ఇచ్చారు. ముందుగా మెహబూబ్ దిల్ సే ఎంట్రీ ఇవ్వగా ఆ తర్వాత మోనాల్, దివిలు తమ గ్లామర్‌తో అదరగొట్టారు. అనంతరం అమ్మ రాజశేఖర్‌, స్వాతిలు స్టేజ్ పై దుమ్ము రేపారు. కుమార్ సాయి మాస్ ఫోక్ సాంగ్‌తో అదరగొడితే... గంగవ్వ స్పెషల్ ఎంట్రీ ఇచ్చి కుమార్ సాయితో కాలు కదిపింది. ఇక కరాటే కళ్యాణి నాదీ నెక్కలీసు గొలుసు పాటకు వావ్ అనిపించే స్టెప్పులు వేసింది.

Bigg Boss Grand Finale:Episode starts in a grandeur, Devi Nagavalli missing

ఇక కలర్‌ఫుల్ డ్రస్‌లో ముక్కు అవినాష్ కూడా డ్యాన్స్‌తో ఎంటర్‌టెయిన్ చేశాడు. అయితే ముక్కు అవినాష్ శనివారం వేసుకున్న డ్రెస్‌ పై ఒక రెడ్ కలర్ బ్లేజర్ వేసుకోవడాన్ని పసిగట్టిన నెటిజెన్లు తమదైన శైలిలో సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు. ఇక చివరిగా ఫ్యామిలీ పార్టీ సాంగ్‌ సమయంలో లాస్య, నోయల్, సూర్యకిరణ్, సుజాతలు కూడా జాయిన్ అయి మురిపించారు. బిగ్‌బాస్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్లందరూ స్టేజ్ పై కనిపించారు కానీ ఓ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న దేవీ నాగవల్లి మాత్రం కనిపించలేదు. అయితే దీనికి కారణాలు తెలియరాలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+