Bigg Boss Telugu Finale:మెహబూబ్‌ లైఫ్ సెటిల్..గ్లామర్ ఒలకబోసిన దేత్తడి, అరియానా

హైదరాబాద్ : బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా ప్రారంభమైంది. కింగ్ నాగార్జున ఎంట్రీతో ప్రారంభమైన షో... ఆ తర్వాత కంటెస్టెంట్ల డ్యాన్స్‌లతో స్టేజ్ మెరిసింది. అనంతరం బిగ్‌బాస్‌కు ముందు బిగ్‌బాస్ తర్వాత ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల జీవితాలు ఎలా మలుపు తిరిగాయనేదానిపై తెలుసుకునే ప్రయత్నం చేశారు కింగ్ నాగార్జున.

 నన్ను చాలా మంది కలుస్తున్నారు

నన్ను చాలా మంది కలుస్తున్నారు

బిగ్‌బాస్ హౌజ్ వీడిన తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్‌ను తమ క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు నాగార్జున. ముక్కు అవినాష్‌ను నాగార్జున పలకరించడంతో తాను చాలా హ్యాపీగా ఉన్నట్లు చెప్పాడు. ప్రేక్షకులను ఎంటర్‌టెయిన్ చేస్తూనే ఉంటానని చెప్పిన అవినాష్... నాగార్జున ఇచ్చిన షర్ట్ చాలా నచ్చిందని వెల్లడించాడు. పొట్ట అలానే ఉందా అని నాగార్జున ప్రశ్నించగా... తాను బిగ్‌బాస్ హౌజ్‌కు తిరిగి ఇచ్చేశానంటూ సరదాగా కామెంట్ చేశాడు. ఇక గంగవ్వ చాలా సంబరంగా ఉన్నట్లు చెప్పింది. బిగ్‌బాస్ హౌజ్‌లో అనారోగ్యం కారణంగా బయటకొచ్చినప్పటికీ... తనను ఎంతో మంది కలుస్తూ ఫోటోలు అడుగుతున్నారని ఆనందం వ్యక్తం చేసింది.

 రెండు సినిమాలకు సైన్

రెండు సినిమాలకు సైన్

ఇక బిగ్‌బాస్‌‌లో తను ఒక పోటీదారుడిగా నిలిచేందుకు అవకాశం ఇచ్చిన బిగ్‌బాస్ నిర్వాహకులకు నాగార్జునకు మెహబూబ్ దిల్‌సే ధన్యవాదాలు తెలిపారు. బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను రెండు సినిమాలు, ఒక వెబ్ సిరీస్‌ సైన్ చేసినట్లు చెప్పాడు. గుంటూరుకు వెళ్లినప్పుడు అక్కడ తన సొంతూరు వారు చూపిన ఆదరాభిమానాలు ఎన్నటికీ మరువలేమని చెప్పాడు. ఇక హౌజ్‌లో ఉన్న సమయంలో తన కొడుకు జున్నును చాలా మిస్ అయినట్లు చెప్పిన లాస్య... ఇంకెప్పుడూ తన కొడుకును వీడి వెళ్లకూడదని డిసైడ్ అయినట్లు చెప్పుకొచ్చింది.

 గ్లామర్ ఒలకబోసిన దేత్తడి, అరియానా

గ్లామర్ ఒలకబోసిన దేత్తడి, అరియానా

బిగ్‌బాస్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్లను పలకరించిన తర్వాత హౌజ్‌లో ఉన్న టాప్ ఫైవ్ కంటెస్టెంట్ల ఎంట్రీ జరిగింది. అఖిల్, సొహెయిల్‌లు స్టెప్పులతో ఇరగదీయగా... బ్లాక్ డ్రెస్‌లో దేత్తడి హారికా గ్లామర్‌ను ఒలకబోసింది. ఇక అరియానా రెండ్ కలర్ డ్రెస్‌లో కెవ్వు కేక అనిపించేలా తయారై డ్యాన్స్ ఇరగదీసింది. ఇక అందరూ విజేతగా భావిస్తున్న అభిజీత్... బాండ్ గెటప్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు పండగను పంచాడు. బిల్లా సినిమాలోని టైటిల్ సాంగ్‌కు స్టెప్పులు వేశాడు. చివరిగా అందరూ కలిసి పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేది చిత్రంలోని ఐటెం సాంగ్‌కు డ్యాన్స్ వేసి అలరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+