Bigg Boss:వీడియో వైరల్ : తమిళ్ బిగ్‌బాస్‌లో మహాప్రస్థానం... కమల్ నోట శ్రీశ్రీ విప్లవ కవిత్వం

ప్రస్తుతం ఎంటర్‌టెయిన్‌మెంట్ రంగంలో భారతదేశాన్ని కుదిపేస్తోన్న ఏకైక షో బిగ్‌బాస్. ఇటు హిందీలో అటు తెలుగులో మరోవైపు తమిళంలో ఈ బిగ్‌బాస్ రియాల్టీ షో దూసుకెళుతోంది. టీఆర్పీల పరంగా కూడా దుమ్ము లేపుతోంది. ఇక బిగ్‌బాస్ హిందీ అటుంచితే.. తమిళంలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌కు కాస్త తెలుగు కనెక్టివిటీ ఉంది. ఎందుకంటే అక్కడ హోస్ట్‌గా వ్యవహరిస్తోంది లోకనాయకుడు కమల్ హాసన్. కమల్ హాసన్‌కు ఒక్క తమిళనాడులోనే కాదు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ మాటకొస్తే ఈ భారతీయుడికి భారత దేశమంతటా అభిమానులు ఉన్నారు. ఇక ఈ సకల కళా వల్లభుడు హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ షోలో తెలుగు పద్యం వినిపించింది. స్వయంగా కమల్ హాసనే ఈ పద్యం చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

శ్రీశ్రీ ...శ్రీరంగ శ్రీనివాసరావు. ఇప్పుడు ఈ కవి పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నారనేగా మీ డౌటు.. అక్కడికే వస్తున్నాం. శ్రీ శ్రీకి బిగ్‌బాస్‌కు చిన్న కనెక్షన్ కుదిరింది. ఎలాగంటారా... ఈ కనెక్షన్‌ను కుదిర్చిన వారు కూడా ఎవరోకాదు మన లోకనాయకుడు కమల్ హాసన్. ఇక అసలు విషయానికొస్తే... తమిళంలో బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజే వేరు. అక్కడ కూడా తెలుగుతో పాటుగా బిగ్‌బాస్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. తాజాగా అంటే ఆదివారం రోజున జరిగిన ఎపిసోడ్‌లో కమల్ హాసన్ ఇంటి సభ్యులకు ఒక విప్లవాత్మకమైన పద్యం వినిపించారు. అదే మన తెలుగు కవి శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానంలోని జగన్నాథ రథచక్రాల పద్యం. ఈ పద్యం విన్నవారెవరికైనా సరే రోమాలు నిక్కపొడ్చుకుంటాయి. ఆ స్థాయిలో ఈ భావం ఉంటుంది.

Bigg Boss:Tamil host Kamal Haasan recites a telugu poem, Video goes viral

ఇక కమల్ హాసన్ ఈ పద్యం వినిపించగానే అక్కడి బిగ్‌బాస్ హౌజ్‌లో సభ్యులు షాక్‌కు గురయ్యారు. అయితే కమల్ హాసన్ నటించిన చిత్రం ఆకలి రాజ్యంలో కూడా శ్రీశ్రీ రాసిన కవితలు వినిపించడం జరుగుతుంది. అంతేకాదు శ్రీశ్రీ అంటే తనకు ఇష్టమైన కవి అని పలుసందర్భాల్లో ఈ విశ్వనాయకుడు చెప్పారు కూడా. ఇక తమిళులకు భారతీయార్ సుబ్రహ్మణ్యం ఎలానో తెలుగు వారికి శ్రీశ్రీ అలా అని మన తెలుగు కవి గొప్పతనాన్ని బిగ్‌బాస్ హౌజ్ వేదికగా చాటి చెప్పారు కమల్ హాసన్. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళులకంటే తెలుగువారే ఎక్కువగా ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. తెలుగు భాష ఎక్కడైనా సరే ఆ గొప్పతనమే వేరని అందులోను శ్రీశ్రీ కవిత్వం అంటే చెవి కోసుకోని వారుండరని కామెంట్స్ పెడుతున్నారు.

Recommended Video

    భారత్‌పై Barack Obama ప్రశంసలు.. 'A Promised Land' పుస్తకంలో ఆసక్తికర విషయాలు ప్రస్తావన!

    ఇక కమల్‌హాసన్ పుట్టిన రోజు సందర్భంగా ఆన్‌లైన్ ద్వారా తెలుగు బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు నాగార్జున పరిచయం చేశారు. అంతేకాదు హారికను కమల్ హాసన్ సేవ్ చేయడంతో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+