Bigg Boss Telugu:గంగవ్వ కష్టమే ఈ కంటెస్టెంట్‌కూ వచ్చింది.. త్వరలోనే ఇంటి నుంచి బయటకు..?

హైదరాబాద్ : బిగ్‌బాస్ తెలుగు సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఇప్పటికే ప్రతివారం ఒకరు ఎలిమినేట్ అవుతున్నారు. ఈ సారి కూడా బిగ్‌బాస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక సాధారణంగా ఉండే ఎలిమినేషన్‌తో పాటు మరొకరు కూడా ఇంటిని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా కాకుండా మరొక కారణంతో ఇంటి నుంచి వెళ్లాలని భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

 అనారోగ్యంతో గంగవ్వ..

అనారోగ్యంతో గంగవ్వ..

బిగ్‌బాస్ షోలో ఎలిమినేషన్‌కు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఇటు ప్రేక్షకుల్లోను అటు కంటెస్టెంట్లలోను టెన్షన్ నెలకొంది. ఆనవాయితీ ప్రకారం బిగ్‌బాస్ హౌజ్ నుంచి ఒకరిని పంపేందుకు బిగ్‌బాస్ సిద్ధమవుతున్నాడు. అయితే ఎలిమినేషన్ సంగతి అటుంచితే మరో వ్యక్తి బిగ్‌బాస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అనారోగ్య కారణంగా బిగ్‌బాస్ షో నుంచి వెళ్లి పోతానంటూ గంగవ్వ బిగ్‌బాస్‌తో మొర్రపెట్టుకోగా.. అందుకు బిగ్‌బాస్ ఒప్పుకుని గంగవ్వను క్షేమంగా తన సొంతింటికి చేర్చాడు. తాజాగా అనారోగ్యం కారణంగా ఇంటిని వీడేందుకు ప్రముఖ సింగర్ నోయల్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

 కాలిగాయంతో బాధపడుతున్న నోయల్

కాలిగాయంతో బాధపడుతున్న నోయల్

నోయల్ సీన్ మంచి గాయకుడిగా తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయం. ఇక బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి నోయల్ సీన్ బలమైన కంటెస్టెంట్‌గా మారాడు. పలు మార్లు ఎలిమినేషన్‌కు నామినేట్ అయినప్పటికీ అతనికున్న పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ అతన్ని ఇంట్లో ఉండేలా చేస్తోంది. గత కొన్ని ఎపిసోడ్స్‌లో నోయల్ సీన్ కాలి గాయంతో బాధపడుతూ టాస్క్‌ సరిగ్గా పెర్ఫార్మ్ చేయడం లేదని ప్రేక్షకులు గమనిస్తున్నారు. అంతేకాదు కాలి నొప్పి తనను విపరీతంగా బాధపెడుతోందంటూ తనను హౌజ్ నుంచి పంపించేందుకు ఏర్పాట్లు చేయాలంటూ బిగ్‌బాస్ షో నిర్వాహకులను నోయల్ సీన్ కోరినట్లు తెలుస్తోంది. దీంతో మరికొన్ని రోజుల్లోనే నోయల్ సీన్ ఇంటి నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 నోయల్ పై నిర్ణయం తీసుకోనున్న నాగ్

నోయల్ పై నిర్ణయం తీసుకోనున్న నాగ్

షో హోస్ట్ అక్కినేని నాగార్జున తన షూటింగ్ నుంచి తిరిగి రాగానే నోయల్ సీన్ ఎగ్జిట్ పై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. నోయల్ సీన్ ఇంట్లో కొనసాగాలా లేదా అనేదానిపై నాగ్ డెసిషన్ తీసుకోనున్నట్లు సమాచారం. అయితే ఇంటిలోని కంటెస్టెంట్ల ఆరోగ్యం ముఖ్యం కనుక షో నిర్వాహకులు కూడా నోయల్ కోరికపై సానుకూలంగా స్పందించే అవకాశాలున్నాయని సమాచారం. ఇక నోయల్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.

Recommended Video

    Bigg Boss Telugu 4 : Gangavva అభిప్రాయం ఇదీ.. మరి మీ దృష్టిలో విన్నర్ ఎవరు ? | Oneindia Telugu
     వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మంగ్లీ..?

    వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మంగ్లీ..?

    ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంటిలోకి అడుగుపెట్టేందుకు తెలంగాణ జానపద గాయని మంగ్లీ సిద్దంగా ఉందంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై షో నిర్వాహకులు ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే నోయల్ సీన్ అభిమానులు తాను టాప్ 5లో ఉంటాడని భావించారు. కానీ అనారోగ్య కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోతారనే వార్తను అభిమానులు జీర్ణించుకోలేకున్నారు.

    మొత్తానికి నోయల్ ఇంటిలోనే కొనసాగాలని పూర్తి ఆరోగ్యంతో ఉండాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ఒకవేళ నోయల్ ఇంటి నుంచి బయటకొస్తే మాత్రం ఎలిమినేషన్ లేకుండా షో నుంచి నిష్క్రమిస్తున్న రెండో కంటెస్టెంట్ అవుతాడు. గంగవ్వ కూడా అనారోగ్యంతోనే హౌజ్ నుంచి ఎగ్జిట్ అయ్యింది. అయితే నోయల్ సీన్ పరిస్థితి ఎలాగుంటుందో తెలియాలంటే ఈ వారం ఎపిసోడ్స్‌ను మిస్ కాకుండా వాచ్ చేయాల్సిందే..

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+