Bigg Boss Telugu:నమ్మించి మోసం చేసిన మోనాల్.. అసలు రంగు ఇదే..!

హైదరాబాదు: బిగ్‌బాస్ హౌజ్‌లో మరో ఎలిమినేషన్ జరిగింది. ఇదేంటి వారాంతంలో కదా ఎలిమినేషన్ జరగాల్సింది ఇప్పుడు జరగడమేంటనేగా మీ డౌటు.. మరి అందుకే ఈ షోను బిగ్‌బాస్ షో అని పిలిచింది. ఈ ఇంట్లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు. ఇక ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఇప్పటికే బుధవారం షో చూసిన ప్రేక్షకులకు అర్థమై ఉంటుంది. ఇంతకీ ఈ కథేంటో చూద్దాం...

స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ ఎలిమినేట్

స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ ఎలిమినేట్

బిగ్‌బాస్‌ షోను రక్తికట్టించేందుకు మిడ్ వీక్ ఎలిమినేషన్‌ జరిగింది. ముందుగా కంటెస్టెంట్లను బ్యాగులను సర్దుకొని లాన్‌లోకి రమ్మన్న బిగ్‌బాస్ అనూహ్యంగా ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుందని చెప్పడంతో కంటెస్టెంట్లు షాక్‌కు గురయ్యారు. ఇక బిగ్‌బాస్ హౌజ్‌లో ఎవరు కొనసాగాలో నిర్ణయించుకోవాలని, సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. మొత్తం 9 మంది ఇంటి సభ్యులు కలిసి ఒక బలమైన కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేయాలని ఆ నిర్ణయం ఏకాభిప్రాయంతో జరగాలని ఆర్డర్ చేశాడు. అయితే బిగ్‌బాస్ ట్రాప్‌ను అర్థం చేసుకున్న అవినాష్ చాలా తెలివిగా వ్యవహరించాడు. ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేయడమంటే పరోక్షంగా అతను మిగతా సభ్యుల కంటే బలమైన కంటెస్ట్ అనే విషయాన్ని గ్రహించాలని అవినాష్ మిగతా సభ్యులకు వివరించాడు.

ఎవరేమన్నారు..?

ఎవరేమన్నారు..?

ఇక అసలు బిగ్‌బాస్ ట్రాప్ ఏంటో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంటిలోని సభ్యులందరు ఏకాభిప్రాయంతో కూడిన ఒక కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేస్తే... ఆ కంటెస్టెంట్‌కు ప్రేక్షకుల ఓట్లు ఎక్కువగా వస్తాయని తద్వారా టైటిల్‌ గెలవడంలో సహాయం చేస్తుందని బిగ్‌బాస్ భావించాడు. అంతేకాదు ఇలా ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ చేయడం వల్ల ప్రేక్షకులు మిగతా కంటెస్టెంట్లకు ఓట్లు వేయరని బిగ్‌బాస్ ఆలోచనగా ఉంది. బిగ్‌బాస్ నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్లలేమని అదే సమయంలో ఒకరు మరొకరికంటే బలమైన కంటెస్టెంట్ అని ఒప్పుకోలేమని దేత్తడి హారిక చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే తనపై ఎవరూ ఎలాంటి ప్రభావం చూపడం లేదని అభిజీత్ చెప్పాడు.

 అఖిల్ ఎలిమినేట్..భోరుమన్న మోనాల్

అఖిల్ ఎలిమినేట్..భోరుమన్న మోనాల్

ఇక బిగ్‌బాస్ ఆజ్ఞలను అనుసరించి అంతా అఖిల్‌ను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అతన్ని ఎలిమినేట్ చేయాలని బిగ్‌బాస్‌కు చెప్పారు. ఇక అఖిల్‌ ఎలిమినేట్ అవుతున్నట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. దీంతో బిగ్‌బాస్ హౌజ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఇక అఖిల్ ఎలిమినేట్ అవుతున్నాడని తెలిసి తన స్నేహితురాలు మోనాల్ గజ్జర్ కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. వెక్కి వెక్కి ఏడ్చింది. అఖిల్ ఎలిమినేట్ అయ్యేందుకు తాను కూడా ఒక కారణం అని తెలిసి మోనాల్ కన్నీటి పర్యంతమైంది. ఆమెను ఆపడం ఎవరి తరం కాలేదు. ఇక లగేజ్ సర్దుకున్న అఖిల్ బయటకు వెళ్లిపోయాడు. కానీ ఇక్కడే ట్విస్ట్ చోటుచేసుకుంది.

Recommended Video

    Bigg Boss Telugu 4: Monal Akhil Hugs మోనాల్‌ను సేవ్ చెయ్యటం కోసం కుమార్ సాయిని ఎలిమినేట్ !!
     ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌ బాస్

    ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌ బాస్

    అఖిల్ వాస్తవానికి ఎలిమినేట్ కాలేదు. అఖిల్‌ను బిగ్‌బాస్ సీక్రెట్ రూంలో ఉంచాడు. అక్కడే కొన్ని రోజులు ఉండి మిగతా ఇంటి సభ్యుల ఆటతీరును గమనించాలని చెప్పడంతో అఖిల్ సంతోషం వ్యక్తం చేస్తూ బిగ్‌బాస్‌కు ధన్యవాదాలు చెప్పాడు. అంతేకాదు ఒక్కొక్క ఇంటి సభ్యుడి అసలు రంగు తెలుస్తుందని ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి బిగ్‌బాస్‌కు అఖిల్ కృతజ్ఞతలు తెలిపాడు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+