Bigg Boss Telugu:Girls గెట్ రెడీ..అఖిల్ హింట్ ఇచ్చేశాడు.. తన భార్య ఎలా ఉండాలంటే: ఫస్ట్ హగ్‌ అంటూ..!

బిగ్‌బాస్ షో 8వ వారానికి చేరుకుంది. ఇప్పటికే అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యారన్న వార్తలు వస్తున్నాయి. అయితే ముందుగానే ప్రేక్షకులకు ఎలిమినేషన్‌పై లీకులు వస్తుండటంతో షో పై ప్రేక్షకులు అంత ఆసక్తి చూపడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఇది పక్కన పెడితే బిగ్‌బాస్ హౌజ్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న అఖిల్ తన భార్య ఎలాగుండాలో మనసులో మాట బయటపెట్టాడు. ఇంతకీ అఖిల్ తన భార్యలో ఎలాంటి క్వాలటీస్ ఉండాలని కోరుకుంటున్నాడు..?

 అఖిల్-మోనాల్ లవ్ ట్రాక్

అఖిల్-మోనాల్ లవ్ ట్రాక్

బిగ్‌బాస్ తెలుగు 4వ సీజన్ క్రమంగా రక్తి కడుతోంది. కంటెస్టెంట్లు చాలా ఓపెన్ అయిపోతున్నారు. తమ వ్యక్తిగత విషయాలు ఇంట్లో వారికి నచ్చిన ఇతర కంటెస్టెంట్లతో పంచుకుంటున్నారు. ఇప్పటికే అఖిల్-మోనాల్‌లు ఎలిమినేషన్‌కు నామినేట్ అవగా వారు సేవ్ అయినట్లు తెలుస్తోంది. అమ్మ రాజశేఖర్ ఎలిమినేషన్‌తో ఇద్దరూ సేఫ్‌గా ఉన్నట్లు సమాచారం. ఇక అఖిల్-మోనాల్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందనే ప్రచారం జరుగుతోంది. అందుకే షో నిర్వాహకులు వీరిద్దరినీ బయటకు పంపేందుకు ఇష్టపడటం లేదని సమాచారం. వీరి ప్రేమాయాణంతో ప్రేక్షకుల్లో ఒక్కింత హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు.

 నా తల్లిదండ్రులను చూసుకుంటే చాలు

నా తల్లిదండ్రులను చూసుకుంటే చాలు

ఇక ఒక అన్‌సీన్ వీడియోలో మోనాల్ అఖిల్‌ను ఓ ప్రశ్న అడిగేసింది. నీ భార్యలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటని అఖిల్‌ను ప్రశ్నించింది. దీనికి అఖిల్ సమాధానం ఇలా ఇచ్చాడు." నాకు వచ్చే భార్య స్వతంత్రంగా ఉండాలి. నన్ను సరిగ్గా చూసుకోకపోయినా ఫర్వాలేదు కానీ... నా తల్లిదండ్రులను చూసుకోవాలి. నిజాయితీగా ఉండాలి. నన్ను ఎవరైనా ఏమైనా అంటే నా తరపున వకాల్తా పుచ్చుకుని వారిని ప్రశ్నించేలా ఉండాలి. " అని అఖిల్ చెప్పాడు. తప్పకుండా నువ్వు కావాలునుకునే అమ్మాయే భార్యగా వస్తుందని అఖిల్‌తో మోనాల్ చెప్పింది. మోనాల్ చెప్పిన మాటలకు అఖిల్ తెలివైన ప్రశ్న అడిగాడు.

 అమ్మాయి ఎప్పుడు దొరుకుతుంది..?

అమ్మాయి ఎప్పుడు దొరుకుతుంది..?

మోనాల్ చెప్పిన మాటలకు అఖిల్ చాలా క్లెవర్‌గా రియాక్ట్ అయ్యాడు. అమ్మాయి బిగ్‌బాస్ షో అయిపోక ముందుకు దొరుకుతుందా.. లేక షో అయిపోయాక దొరుకుతుందా అని అఖిల్ ప్రశ్నించాడు. అయితే షో తర్వాతే నువ్వు కోరుకుంటున్న నీ స్వప్న సుందరి దొరుకుతుందని మోనాల్ చెప్పుకొచ్చింది. షో అయిపోగానే గేట్ దగ్గర ఒక హగ్ ఇచ్చేందుకు ఆమె వెయిట్ చేస్తూ ఉంటుందని మోనాల్ చెప్పడంతో అఖిల్ ఒక్కింత ఆశ్చర్యానికి గురయ్యాడు. అయితే ఆ అమ్మాయి ఎవరో అని మాత్రం మోనాల్ క్లారిటీ ఇవ్వకుండా ప్రేక్షకులను కన్ఫ్యూజన్‌లోకి నెట్టివేసింది.

 ఆ స్వప్న సుందరి మోనాలేనా..?

ఆ స్వప్న సుందరి మోనాలేనా..?

ఇక మోనాల్ సమాధానంతో నెటిజెన్లు రకకాలుగా చర్చించుకుంటున్నారు. షో తర్వాత గేట్ వద్ద హగ్ ఇచ్చేందుకు వెయిట్ చేసే స్వప్న సుందరి మరెవరో కాదు మోనాలే అని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే మోనాల్- అఖిల్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నందున అఖిల్ భార్య మోనాల్ అయితేనే బాగుంటుందని మరికొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి మోనాల్ -అఖిల్ ఈ వారం కూడా సేవ్ అయినట్లు సమాచారం. దీంతో వీరి మధ్య లవ్ స్టోరీ మరింత స్పైసీగా మారే అవకాశాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+