Bigger Boss Telugu: "అమ్మ"కు బొమ్మ..ఈవారం రాజశేఖర్ ఎలిమినేట్..!
హైదరాబాదు: బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో రక్తికడుతోంది. కంటెస్టెంట్లు హౌజ్‌లో అదరగొడుతున్నారు. ఇచ్చిన టాస్కులపై ఫోకస్ చేసి పూర్తి చేసేందుకు కష్టపడుతున్నారు. ఇక ఈ వారం ఎలిమినేషన్‌కు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఇటు టీవీల ముందున్న ప్రేక్షకులకు అటు బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్లలో టెన్షన్ నెలకొంది. ఇంతకీ ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు..? ఇప్పటికే దీనిపై ఓ క్లారిటీ వచ్చేసింది.

జోరుమీదున్న బిగ్‌బాస్ షో
బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో జోరుమీదుంది. అటు టీఆర్పీ రేటింగ్స్ ఇటు షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యేలా నిర్వాహకులు చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక 8వ వారం ఎలిమినేషన్‌కు సమయం దగ్గరపడుతోంది. ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేదానిపై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ సారి కూడా ప్రేక్షకుల ఓటింగ్‌ను పరిగణలోకి తీసుకుంటారా, లేదా షరామామూలే అన్నట్లుగా బిగ్‌బాస్ నిర్వాహకులు తమకు నచ్చిన వారిని ఇంట్లోనే ఉంచి, నచ్చని వారిని బయటకు పంపుతారా అని నెటిజెన్లు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు.

అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్
బిగ్‌బాస్ 8వ వారం ఎలిమినేషన్‌కు లాస్యా, అఖిల్, మోనాల్, అరియానా, మెహబూబ్, అమ్మ రాజశేఖర్‌లు నామినేట్ అయ్యారు. అయితే బై డీఫాల్ట్‌గా మోనాల్ సేవ్ అవుతుందని సమాచారం. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అరియానా గ్లోరీకి ఓట్లు మిగతా కంటెస్టెంట్ల కంటే ఎక్కువగా రావడంతో ఆమె సేఫ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక అమ్మ రాజశేఖర్‌కు అత్యల్ప ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ సారి నామినేషన్స్ సందర్భంగా అమ్మ రాజశేఖర్ చెప్పిన కారణాలు సంతృప్తికరంగా లేవని సమాచారం. అంతేకాదు ఇతర ఇంటి సభ్యులతో కూడా అమ్మ రాజశేఖర్ సంబంధాలు సరిగ్గా లేవని ప్రేక్షకులు భావిస్తున్నారు. దీంతో అమ్మ రాజశేఖర్‌కు చాలా తక్కువ ఓట్లు వచ్చినట్లు సమాచారం. దీంతో ఈ సారి అమ్మ రాజశేఖర్ ఇంటి నుంచి ఎగ్జిట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం.

చివరి నిమిషంలో షాకిస్తారా..?
ఇక బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు 8వ వారంలో రెండో రోజు వరకు పోలైన ఓట్లలో అఖిల్‌కు 24శాతం, లాస్యకు 23 శాతం, అరియానాకు 21శాతం, మోనాల్‌కు 16శాతం, మెహబూబ్‌కు 7శాతం, అమ్మ రాజశేఖర్‌కు 6శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే ఇది కేవలం అంచనా మాత్రమే. నాగార్జున చెప్పే వరకు ఏదీ అధికారిక ప్రకటన కాదు. మరోవైపు ఎలిమినేషన్ ప్రక్రియలో ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఆరవ వారంలో మోనాల్ ఎలిమినేట్ అవుతుందని అంతా భావించగా..సడెన్‌గా కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఏడవ వారంలో కూడా మోనాల్ ఎలిమినేట్ అవుతుందని అంతా భావించినప్పటికీ దివి అనూహ్యంగా ఇంటి నుంచి బయటకు రావడంతో షాక్‌కు గురయ్యారు.
ఇక ఈ సారి అమ్మ రాజశేఖర్ బయటకు వస్తారో లేక మరొక కంటెస్టెంట్ బయటకు వస్తారో తెలియాలంటే ఈ ఆదివారం వరకు వేచిచూడాల్సిందే.












Click it and Unblock the Notifications