Bigg Boss Telugu-4:"అమ్మ"ను పంపుదామనుకున్న ప్రేక్షకులకు షాక్..అతనే కాపాడాడు..!
హైదరాబాద్ : బిగ్ బాస్ హౌజ్ 8వ వారంలో ట్విస్టు చోటుచేసుకుంది. వాస్తవానికి అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ కావాల్సి ఉండగా... 8వ వారం నో ఎలిమినేషన్ డే గా బిగ్‌బాస్ ముగిసింది. ఇంతకీ హౌజ్‌లో చోటుచేసుకున్న ట్విస్టు ఏంటి..?

ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్
బిగ్‌బాస్ 8వ వారంలో అనూహ్య మలుపులు చోటుచేసుకున్నాయి. ఎలిమినేషన్ ఉంటుందని షో ఆసాంతం ఎదురుచూసిన ప్రేక్షకులకు బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇక నామినేషన్ నుంచి ముందుగా ఒక్కొక్కరు సేఫ్ అవుతూ వచ్చారు. చివరగా అరియానా, అమ్మ రాజశేఖర్, మెహబూబ్‌లు నామినేషన్‌లో ఉండగా.. సేఫ్ చేసే ప్రక్రియ కాస్త ఇంట్రెస్టింగ్‌గా మలచాడు బిగ్‌బాస్. ముందుగా స్టోర్ రూం నుంచి అవినాష్‌ను ఓ బోర్డు తీసుకురమ్మన్నారు హోస్ట్ నాగార్జున. అదొక పజిల్ బోర్డు. అందులో ఎవరి పేరు అయితే వరసగా వస్తుందో వారు సేఫ్ అవుతారని నాగార్జున చెప్పాడు. దీంతో అరియానా పేరులోని అక్షరాలు వరసగా ఉండటంతో ఆమె సేఫ్ అయ్యింది. ఇక చివరిగా అమ్మ రాజశేఖర్, మెహబూబ్‌లు నామినేషన్‌లో ఉన్నారు. వారిద్దరిని కన్ఫెషన్ రూంకు వెళ్లమన్నారు నాగార్జున.

ఇంటికి అమ్మ రాజశేఖర్ అక్కర్లేదు
ఇక ఆ రూంలో అమ్మ రాజశేఖర్, మెహబూబ్‌లు ఉండగా హాల్‌లో ఉన్న ఇంటి సభ్యులకు ఒక పనిచెప్పారు నాగార్జున. అమ్మ రాజశేఖర్, మెహబూబ్‌లలో ఎవరు ఇంటికి అవసరం లేదనుకుంటున్నారో చెప్పాలంటూ కోరారు. దీంతో అవినాష్ అరియానాలు తప్ప మిగతా కంటెస్టెంట్లు మొత్తం అమ్మ రాజశేఖర్ ఇంటికి అక్కర్లేదని తేల్చేశారు. ఇందుకు ఎవరి కారణాలు వారు చెప్పారు. అవినాష్, అరియానాలు మాత్రమే మెహబూబ్ ఇంటికి అక్కర్లేదని చెప్పారు. దీంతో కన్ఫెషన్ రూంలో ఉన్న మాస్టర్, మెహబూబ్‌లు ఇద్దరూ చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఇక అమ్మరాజశేఖర్ ఎలిమినేట్ అని నాగార్జున చెప్పడంతో గట్టిగా ఏడ్చేస్తూ కన్ఫెషన్ రూం నుంచి బయటకు వచ్చేశాడు మెహబూబ్.

అమ్మ రాజశేఖర్‌ను కాపాడిన నోయల్
లగేజ్ ప్యాక్ చేసుకోవాల్సిందిగా అమ్మరాజశేఖర్‌ను నాగార్జున ఆదేశించాడు. కన్ఫెషన్ రూం నుంచి బయటకు వచ్చి లగేజీ తీసుకుని వెళుతుండగా నాగ్ ట్విస్ట్ ఇచ్చాడు. అమ్మ రాజశేఖర్ సేఫ్ అని చెప్పడంతో అప్పటి వరకు ఏడుస్తున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారిగి ఎగిరి గంతేశారు. రాజశేఖర్‌ను హగ్ చేసుకున్నారు. ఆ తర్వాత నాగార్జున అసలు సీక్రెట్ రివీల్ చేశాడు. అనారోగ్యం కారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్లిన నోయల్ సీన్... వెళుతూ వెళుతూ తనను చిన్న కోరిక కోరినట్లు నాగార్జున కంటెస్టెంట్లకు చెప్పాడు. అమ్మ రాజశేఖర్‌ను ఎలిమినేట్ చేయొద్దంటూ చెప్పడంతో అదే విజ్ఞప్తిని తాను బిగ్‌బాస్‌కు చెప్పగా ఇందుకు అంగీకరించాడని చెప్పడంతో ఇంటి సభ్యులు బిగ్‌బాస్‌కు థాంక్యూ చెప్పారు. ఇక చివరిగా మరో బంపర్ ఆఫర్ అమ్మ రాజశేఖర్‌కు నాగార్జున ఇచ్చాడు. చాలామంది కంటెస్టెంట్లు అమ్మ రాజశేఖర్ ఇంటికి అవసరం లేదని చెప్పారని... అయితే ఈ వారం కెప్టెన్‌గా మాస్టర్ వ్యవహరిస్తారని చెప్పి మరో పుల్లపెట్టారు.
మొత్తానికి నోయల్ పుణ్యమాని సేఫ్ అయిన అమ్మ రాజశేఖర్ ఈ వారంలో ఎలా ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి. ఈ ఎపిసోడ్ ఎలిమినేషన్ ప్రక్రియ గతంలో హారికను ఎలిమినేట్ చేసినట్టే చేసి ఇంటికే పరిమితం చేసిన విషయం ప్రేక్షకులకు గుర్తుకు తెచ్చింది.












Click it and Unblock the Notifications