Bigg Boss Telugu 7: నా బతుకు ఉల్టా అయింది- నటుడు శొంఠినేని శివాజీ: గ్రాండ్ ఎంట్రీ
హైదరాబాద్: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఇంటింటినీ పలకరించింది. కొద్దిసేపటి కిందటే బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్‌గా ఆరంభమైంది. ఉల్టా పుల్టా సీజన్ కావడం వల్ల అన్నీ ప్రత్యేకతలే కనిపించాయి బిగ్ బాస్ హౌస్‌లో. హౌస్ మేట్స్ సెలెక్షన్ కూడా డిఫరెంట్‌గా ఉంది.
లాంచింగ్ ఎపిసోడ్‌లోనే బాంబు పేల్చారు అక్కినేని నాగార్జున. ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ కూడా కన్‌ఫర్మ్ కాలేదనీ తేల్చి చెప్పారు. ఉల్టా పుల్టా సీజన్ కావడం వల్ల బిగ్ బాస్ ఇచ్చే పవర్ అస్త్ర అనే బ్రహ్మాస్త్రాన్ని అందుకుంటేనే హౌస్‌లోకి వెళ్లగలరనీ స్పష్టం చేశారు. దాన్ని దక్కించుకున్న వారే హౌస్ మేట్స్ అవుతారని పేర్కొన్నారు.

తొలి కంటెస్టెంట్‌గా సీరియల్ నటి ప్రియాంక జైన్.. డయాస్‌పైకి వచ్చారు. పొట్టి పిల్ల అనే సాంగ్‌కు అదరగొట్టేలా డాన్స్ చేశారు. హౌస్‌లో ఆమెనే మొట్టమొదటి సారిగా అడుగు పెట్టారు కూడా. బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందనేది ఇంట్రడ్యూస్ చేశారు. బ్రహ్మాస్త్రాన్ని దక్కించుకుంటేనే ఆమె బిగ్ హౌస్ కంటెస్టెంట్‌గా కొనసాగుతారు.
రెండో కంటెస్టెంట్‌గా నటుడు శివాజీ బిగ్ బాస్ డయాస్ మీద గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్‌కు ఎలా సెలెక్ట్ అయ్యాడో చెప్పుకొచ్చారు. సినిమాల్లో నటించాలనే ఉద్దేశం తనకు లేదని, బతకడానికి హైదరాబాద్‌కు వచ్చి సినీ ఫీల్డ్‌లోకి రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తన బతుకు ఉల్టా అయిందంటూ నవ్వుతూ కామెంట్ చేశారు.
బిగ్ బాస్ హౌస్‌లో బయట జరుగుతున్న పాలిటిక్స్‌కు మించి ఉంటాయని, దీన్ని ఎలా ఎదుర్కొంటావని నాగార్జున ప్రశ్నించగా.. గొంతేసుకుని పడిపోవడమేనని శివాజీ వ్యాఖ్యానించారు. బిగ్ బాస్ టైటిల్ గెలవాలనే ఉద్దేశంతోనే ఒక్కడికి వచ్చాననీ, గెలిచి తీరుతాననే ధీమాను వ్యక్తం చేశారు శివాజీ.












Click it and Unblock the Notifications