Bigg Boss:ఈ వారం మన రెడ్డి గారి అమ్మాయి ఔట్...అఖిల్ వల్ల మోనాల్ సేఫ్..తాజా ఖబర్ ఇదే..!

హైదరాబాదు: బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ముగింపు దశకు చేరుకుంటున్న క్రమంలో ఎపిసోడ్‌కు ఎపిసోడ్ వేడెక్కుతోంది. తాజాగా సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు ఏకంగా కొట్టుకునే స్థాయికి చేరుకున్నారు. వారి వాగ్వాదం చూసిన వారెవరైనా ఇక భౌతిక దాడికి దిగడమే మిగిలిందన్న అభిప్రాయానికి వచ్చేశారు. అంతలా నిన్న నామినేషన్ ఎపిసోడ్ జరిగింది. ముఖ్యంగా సోహెయిల్-హారికా, అఖిల్-అభిజీత్‌ల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. ఇక ఎలిమినేట్ ఎవరవుతారనే దానిపై లీకులు వస్తున్నాయి. ఇంతకీ ఎవరు ఎలిమినేట్ అవుతారో ఓ సారి అనాలిసిస్ చేద్దాం.

తక్కువ ఓట్లతో లాస్య

తక్కువ ఓట్లతో లాస్య

ఆదివారం రోజున మెహబూబ్ బిగ్‌బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఈ సారి ఎలిమినేషన్‌కు అఖిల్-అవినాష్‌లు తప్ప మిగతా ఇంటి సభ్యులంతా నామినేట్ అయ్యారు. ఇక ఎలిమినేషన్ ప్రక్రియకు వస్తే ఈ సారి లాస్య రెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న కంటెస్టెంట్లలో లాస్య రెడ్డి పెద్దగా ప్రేక్షకులను ఎంటర్‌టెయిన్ చేయకపోగా... బలహీనమైన కంటెస్టెంట్‌గా నిలిచింది. ఇంకా ఐదు రోజుల సమయం ఉన్నందున లాస్య గేమ్ మారితే ఆమె ఇంటి నుంచి బయటకు రాకపోవచ్చు. ఒకవేళ బిగ్‌బాస్ లాస్యను పంపించాలని ఫిక్స్ అయితే మాత్రం ఎవరూ ఏమీ చేయలేరు. ప్రస్తుతం ఓట్ల శాతంలో లాస్య 8.82శాతం ఓట్లతో చివరి స్థానంలో ఉంది.

 మోనాల్‌కు అఖిల్ ఫ్యాన్స్ అండ

మోనాల్‌కు అఖిల్ ఫ్యాన్స్ అండ

ఇక అసలు సిసలైన పరీక్ష ఇక్కడే ఉంది. ఓటింగ్ శాతంలో లాస్య కంటే కాస్త మెరుగ్గా 9.68శాతం ఓట్లతో మోనాల్ ఉంది. అయితే ఒకవేళ మోనాల్‌ మరో ఐదు రోజుల్లో మంచి ప్రదర్శన కనబర్చకపోయి లాస్య కంటే తక్కువగా ఓట్లు వచ్చినప్పటికీ ఆమెను సేవ్ చేసేందుకు ఎలాగూ బిగ్‌బాస్ షో నిర్వాహకులు ప్రయత్నిస్తారు కాబట్టి ఆమె ఎలిమినేషన్ ఉండకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. అంతేకాదు అఖిల్ నామినేషన్ జాబితాలో లేనందున అతని అభిమానుల ఓట్లన్నీ మోనాల్‌కు మరలి ఆమె సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం అభిజీత్, అరియానా, హారికా, సోహైల్‌లు ఇంటిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా ఉన్నారు. దీంతో మోనాల్, లాస్య రెడ్డి డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక చెప్పాల్సిన పనిలేదని మోనాల్ కోసం బిగ్‌బాస్ లాస్య రెడ్డిని ఇంటి నుంచి బయటకు పంపుతారని వార్తలు వస్తున్నాయి.

Recommended Video

    'Still The Boss'- Chris Gayle, The Only Cricketer To Score 1000 Sixes In T20 History | #UniverseBoss
    ఇక్కడ ఏమైనా జరగొచ్చు..

    ఇక్కడ ఏమైనా జరగొచ్చు..

    ఇక అన్నిటికంటే ముఖ్యం మోనాల్‌కు హోస్ట్ నాగార్జున అండదండలు కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాబట్టి మోనాల్‌కు తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు మాత్రం లేవని సమాచారం. ఇక లాస్య లగేజ్ ప్యాక్ చేసుకుని ఈ వారాంతంలో ఇంటి నుంచి బయటకు వస్తుందని లీకులు కూడా వస్తున్నాయి. అయితే ఎలిమినేషన్ ప్రక్రియ గురించి ఇప్పుడప్పుడే మాట్లాడటం సరికాదు. ఎందుకంటే అది బిగ్‌బాస్ హౌజ్. అక్కడ ఏమైనా జరగొచ్చు. ఓడలు బండ్లు మారే అవకాశం ఉంది అదే సమయంలో బండ్లు ఓడలయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఈ క్రమంలోనే లాస్యను ఎలాగైనా సేవ్ చేయాలని ఒక వర్గం వారు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే మోనాల్ కోసం లాస్య ఈ సారి బలి అవుతోందన్న అంచనా నిజమవుతుందో లేదో తెలియాలంటే ఈ వారాంతం వరకు వేచి చూడాల్సిందే..!

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+