Bigg Boss Telugu winner:అంతా ఊహించినట్లే... విజేత అభిజీత్..రన్నర్ అఖిల్.. పాతిక లక్షలతో సోహైల్ హ్యాపీ..!
హైదరాబాదు: బిగ్‌బాస్ తెలుగు సీజన్ -4 ఎంత గ్రాండ్‌గా ప్రారంభమైందో... అంతే గ్రాండ్‌గా ముగిసింది. హోస్ట్ నాగార్జున ఎంట్రీతో స్క్రీన్ కలర్‌ఫుల్‌గా మారింది. ఆ తర్వాత ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల ఎంట్రీ ఆపై ఇంటిలో ఉన్న టాప్ ఫైవ్ కంటెస్టెంట్ల డ్యాన్సులతో బిగ్‌బాస్ చివరి ఎపిసోడ్ చాలా గ్రాండ్‌గా మారింది. ఇక కొందరు సెలబ్రిటీలు కూడా ఈ కలర్‌ఫుల్ ఈవెంట్‌కు యాడెడ్ ఫ్లేవర్ ఇచ్చారు. యువ డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్లు మెహ్రీన్ ఫిర్జాదా, లక్ష్మీ రాయ్, ప్రణీతలు షోలో ఎంట్రీ ఇచ్చి తమ స్టెప్పులతో ఇరగదీశారు. అంతేకాదు ఇంటిలోని సభ్యులను కూడా పలకరించారు.

బిగ్ బాస్ హౌజ్‌లో సెలబ్రిటీలు
బిగ్‌బాస్ తెలుగు సీజన్-4 చివరి ఎపిసోడ్ అంటే గ్రాండ్ ఫినాలే చాలా కలర్‌ఫుల్‌గా ప్రారంభమైంది. ఎలిమినేషన్ ప్రక్రియపై మొదట్లో కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ... ఫినాలేలో మాత్రం ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగానే విజేతను ప్రకటించడం జరిగింది. ముందుగా ఎలిమినేషన్ ప్రక్రియ షురూ అయ్యింది. గ్రాండ్ ఫినాలేలో మొదటిగా ఎలిమినేట్ అయ్యింది దేత్తడి హారికా. లోపలికి వెళ్లిన సెలబ్రిటీ గెస్టులు అనిల్ రావిపూడి, మెహ్రీన్‌లు ఎలిమినేట్ అయిన హారికాను బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఇంట్లోని స్ట్రాంగ్ కంటెస్టెంట్ అరియానా కూడా ఎలిమినేట్ అయ్యింది. ఆమెను లక్ష్మీరాయ్ బిగ్‌బాస్ హౌజ్ నుంచి స్టేజ్ పైకి తీసుకొచ్చారు.

బంపరాఫర్ ఇచ్చిన నాగార్జున
ఇక ఇంట్లో లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవడంతో ఈ సారి కూడా విజేత మగవారే ఉంటారన్న క్లారిటీ వచ్చింది. ఇంట్లో సోహైల్, అభిజీత్, అఖిల్‌లు మాత్రమే మిగిలారు. అయితే నాగార్జున సొహైల్‌కు ఓ బంపరాఫర్ ఇచ్చారు. చిన్న బడ్జెట్ సినిమాలో నటించాలని ఉందని సొహైల్ చెప్పడంతో ఓ బ్రీఫ్ కేసులో ఉంచిన డబ్బులు తన స్వప్నాన్ని కొంత వరకు నిజం చేస్తుందని చెప్పారు. అయితే ఇందుకు సొహైల్ ఎలాంటి మొహమాటం లేకుండా తనే ఈ డబ్బులు తీసుకుంటానని చెప్పేశాడు. ఇక మొత్తం రూ.25 లక్షలు ప్రకటించడంతో ఆ డబ్బులు తీసుకున్నాడు సోహైల్.

సోహైల్ ఎపిసోడ్‌లో ట్విస్ట్
సోహైల్ అందుకున్న రూ. 10 లక్షలు ఆనాథాశ్రమంకు విరాళంగా ఇస్తానని చెప్పాడు . అయితే స్టేజ్‌పైకి వచ్చాక రూ.5 లక్షలు అనాథశరణాలయానికి, మరో రూ.5 లక్షలు తన ఫ్రెండ్ మెహబూబ్‌కు ఇస్తానని చెప్పాడు. కానీ మెహబూబ్ కూడా అనాథాశ్రమంకే ఇస్తానని చెప్పడంతో స్టేజ్ చప్పట్లతో మోగిపోయింది. అయితే ఆ పది లక్షల రూపాయలు అనాథాశ్రమంకు తనే అందజేస్తానని నాగార్జున చెప్పడంతో మరోసారి స్టేజ్ చప్పట్లతో మోగిపోయింది.

మెగాస్టార్ చేతుల మీదుగా...అభిజీత్‌కు టైటిల్
ఇక చివరగా అఖిల్ అభిజీత్ టాప్ 2లో నిలిచారు. అంతా ఊహించినట్లుగానే జరిగింది. అఖిల్‌ను కాదని అభిజీత్‌కే ప్రేక్షకులు పట్టం కట్టారు. ప్రేక్షకులు ఎప్పుడూ లేనంతగా అభిజీత్‌కు అత్యధిక ఓట్లు వేసి అతన్ని విజేతగా నిలిపారు. అభిజీత్ తల్లి చెప్పినట్లుగా తన కొడుకు విజేతగా నిలిచి మరో "విజేత " మెగాస్టార్ చిరంజీవి నుంచి టైటిల్ ట్రోఫీని అందుకున్నారు. బిగ్‌బాస్ తెలుగు సీజన్-4 విజేతగా నిలిచాడు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications