Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bigg Boss Telugu:మోనాల్‌కు ఓంకార్ అన్నయ్య బంపరాఫర్... గ్లామ్‌ డాల్ ఫేట్ మారిపోయినట్టే..!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ -4, ఈ మెగా రియాల్టీ షో సెప్టెంబర్ 6న ప్రారంభమై డిసెంబర్ 20న ముగిసింది. ఇందులో కంటెస్టెంట్స్ అందరికీ ఓ కొత్త లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ సారి కంటెస్టెంట్లు షోలోకి ఎంటర్ కాకముందు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని వారు. కానీ వన్స్ స్టెప్డ్ ఇన్... వారీ జిందగీనే మారపోయిందని చెప్పాలి.

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు

 కంటెస్టెంట్లకు మంచి ఆఫర్లు

కంటెస్టెంట్లకు మంచి ఆఫర్లు

బిగ్‌బాస్ తెలుగు సీజన్-4 అదరహో అనిపించింది. 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షో... చివరి వారానికల్లా టాప్ ఫైవ్ గ్రాండ్ ఫినాలేకు ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ కంటెస్టెంట్స్ బిగ్‌బాస్ హౌజ్‌లో ఉండగానే వీరికి మంచి ఆఫర్లు వచ్చాయి. కొందరికి వెబ్ సిరీస్ ఆఫర్లు రాగా మరికొందరికి సినిమా అవకాశాలు వచ్చాయి. మొత్తానికి వీరికి ప్రేక్షకుల్లో చాలా క్రేజ్ ఏర్పడింది. అభిజీత్‌కు సినిమా అవకాశాలతో పాటు వెబ్ సిరీస్‌లలో ఛాన్సులు వచ్చాయి. వాస్తవానికి మూడో స్థానంలో నిలిచినప్పటికీ సోహైల్ టాక్ ఆఫ్ ది బిగ్‌బాస్‌గా నిలిచాడు. ఇతని కథ కూడా వేరేలా ఉంది.

 గ్లామ్ డాల్ మోనాల్‌ పంట పండింది

గ్లామ్ డాల్ మోనాల్‌ పంట పండింది

ఇక బిగ్‌బాస్ హౌజ్‌లో గ్లామర్‌తో అలరించి అందరినీ ఆకట్టుకున్న ముద్దుగుమ్మ మోనాల్ గజ్జర్. ఈ అందాల భామ పలుమార్లు ఎలిమినేషన్‌కు నామినేట్ అయినప్పటికీ సేవ్ అవుతూ చివరిగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌గా నిలిచింది. తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసిన మోనాల్ గజ్జర్, గుజరాతీలో కూడా సినిమాలు చేసింది. అయితే తనకు లైఫ్ ఇచ్చింది మాత్రం తెలుగు ఇండస్ట్రీనే అని పలు మార్లు చెప్పుకొచ్చింది. అంతేకాదు తను హైదరాబాదులోనే మంచి ఇళ్లు కొని ఇక్కడే సెటిల్ అయి తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉండాలని కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ ముద్దు గుమ్మకు అవకాశాలు వస్తున్నాయి. అయితే వెండితెరపై కాదు.. బుల్లి తెరపై.

 ఓంకార్ షోలో మోనాల్

ఓంకార్ షోలో మోనాల్

అవును మోనాల్ గజ్జర్‌కు ప్రముఖ యాంకర్ ఓంకార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న డ్యాన్స్ ప్లస్ షోలో జడ్జిగా వ్యవహరించనున్నట్లు సమాచారం. డిసెంబర్ 27వ తేదీ నుంచి మా టీవీలో ప్రసారం కానున్న ఈ డ్యాన్స్ రియాల్టీ షోకు మోనాల్ జడ్జిగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఈ షోకు ఇతర జడ్జీలుగా ప్రముఖ కొరియోగ్రాఫర్లు బాబా మాస్టర్, యష్ మాస్టర్, రఘు మాస్టర్లతో పాటు మరికొందరు న్యాయనిర్ణేతలుగా ఉంటారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక కట్ చేస్తే బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌లో పేమెంట్ పరంగా మోనాల్‌ కూడా అధిక పారితోషికమే తీసుకుంది. 14 వారాల పాటు బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్న మోనాల్‌కు నిర్వాహకులు రూ.30 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+