Bigg Boss Telugu:స్వాతి దీక్షిత్ ఫ్యాన్స్ ఫైర్... అన్నపూర్ణ స్టూడియోస్‌ వద్ద నిరసనలు..!

హైదరాబాద్: టాలీవుడ్ నటి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్‌కు మద్దతు పెరుగుతోంది. సాక్షి దీక్షిత్ ఎలిమినేషన్‌లో ఏదో కుట్ర దాగి ఉందంటూ షోను ఫాలో అవుతూ వస్తున్న కొంతమంది అభిమానులు హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్ బయట నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

ఇక్కడే బిగ్‌బాస్ కార్యక్రమం జరుగుతోంది. సరైన కారణం లేకుండా స్వాతి దీక్షిత్‌ను ఎలిమినేట్ చేశారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ నిర్వాహకులు చొరవ తీసుకుని తిరిగి స్వాతి దీక్షిత్‌ను ఇంటిలోకి పంపాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే స్వాతి దీక్షిత్‌కు సరిపడా సమయం నిర్వాహకులు ఇవ్వలేదని అభిమానులు విమర్శించారు. అంతేకాదు ఓటింగ్ ప్రక్రియ ఎలిమినేషన్ ప్రక్రియ సరిగ్గా జరగలేదని ఏదో కుట్ర జరిగిందని అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇక స్వాతిని ఇంటి నుంచి పంపించివేయాలని ఓటింగ్ ప్రక్రియ ముగియక ముందే నిర్ణయం తీసుకున్నారనే అనుమనాలను సైతం స్వాతి దీక్షిత్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

Bigg Boss Telugu: Swathi fans stage protest outside Annapurna studios over her elimination

తాము చేస్తున్న నిరసనకు అర్థం ఉందని... స్వాతి దీక్షిత్‌కు అభిమానులు లేరని అనుకుంటే పొరపాటే అవుతుందని ఫ్యాన్స్ అన్నారు. ఆమె ఆటలో కొనసాగాలని తామంతా స్వాతికి ఓటువేశామని వెంటనే స్వాతిని బిగ్‌బాస్ హౌజ్‌లోకి పంపాలని డిమాండ్ చేశారు.

ఇక ఇంటి సభ్యుల్లో కూడా స్వాతి ఎలిమినేషన్‌పై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్వాతిని కావాలనే అమ్మా రాజశేఖర్ నామినేట్ చేశారంటూ సింగర్ నోయల్ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే కేవలం స్వాతిని ఎలిమినేట్ అయ్యేందుకు కారణమైన అమ్మా రాజశేఖర్‌ను నోయల్ ఎలిమినేషన్‌కు నామినేట్ చేశాడు.

Recommended Video

    Bigg Boss Telugu 4 : Fake Voting Says Swati Dixit సంచలన విషయాన్నిబయటపెట్టిన స్వాతి దీక్షిత్

    ఎన్నో వివాదాలకు కారణమవుతున్న వారిని వదిలేసి చక్కగా ఆడుతున్న స్వాతి దీక్షిత్‌ను ఎలిమినేట్ చేయడమేంటని అభిమానులు ప్రశ్నించారు. అయితే అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ ముందు నిరసనలు చేపడుతుండటం షో నిర్వాహకుల దృష్టికి వెళ్లింది. స్వాతిని తిరిగి ఇంటిలోకి పంపుతారా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+