Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bigg Boss Telugu: షో నుంచి బిట్టూ బేబీ సుజాత ఔట్..మాస్టర్ సేఫ్..గంగవ్వ చెప్పిందే నిజమైంది..!

హైదరాబాద్: బిగ్‌బాస్‌లో మరో వికెట్ పడిపోయింది. ఊహించిందే జరిగింది. జోర్దార్ సుజాతకు బిగ్‌బాస్ గుడ్‌బై చెప్పేశాడు. మొత్తం తొమ్మిదిమంది నామినేషన్‌లో ఉండగా చివరకు అనుకున్నట్లుగానే మోనాల్,అమ్మా రాజశేఖర్, సుజాతలు ఎలిమినేషన్‌లోకి వచ్చారు. ఇందులో మోనాల్ సేఫ్ కాగా.. మిగతా ఇద్దరిలో సుజాత్ సూట్‌కేస్ సర్దేసుకుని షో నుంచి బయటకు వచ్చేసింది.

సేవ్ కాలేకపోయిన సుజాత

సేవ్ కాలేకపోయిన సుజాత

బిగ్‌బాస్ షో ప్రారంభమై అప్పుడే ఐదువారాలు అయిపోయింది. ప్రతి వారం ఒకరి చొప్పున ఎలిమినేషన్ జరుగుతోంది. మధ్యలో ఓ సారి డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా జరిగాయి. ఇందులో భాగంగా ఎంటర్ అయిన స్వాతి దీక్షిత్ ఎగ్జిట్ కూడా అయిపోయింది. ఇక ఓటింగ్ ప్రక్రియ, ఎలిమినేషన్ ప్రక్రియలపై ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. ఈ అనుమానాలన్నీ పక్కనబెడితే సుజాత మాత్రం సేవ్‌కాలేక పోయింది. మొత్తానికి గంగవ్వ చెప్పినట్లుగా సుజాత షో నుంచి ఎలిమినేట్ అయ్యింది.

బిగ్‌ బాస్ నుంచి సుజాత రాంరాం

బిగ్‌ బాస్ నుంచి సుజాత రాంరాం

ఊహించిందే జరిగింది. నామినేషన్‌లో తొమ్మిది మంది ఉన్నప్పటికీ... అమ్మా రాజశేఖర్ సుజాతలకు అతి తక్కువగా ఓట్లు రావడంతో వీరిద్దరే రేసులో ఉన్నారు. అయితే అమ్మా రాజశేఖర్‌కు తమిళనాడు నుంచి కూడా ఓట్లు రావడంతో ఆయన సేఫ్‌ అయినట్లు సమాచారం. ఇక్కడే సుజాతకు మైనస్ అయినట్లు తెలుస్తోంది. ఇక బిట్టూ అంటూ నాగార్జునకు బిస్కెట్ వేసిన సుజాత ఎలిమినేట్ అయ్యింది. ఇంటిలో సుజాత తీరుపై పలువురు ఇంటి సభ్యులు కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమె నవ్వులో సహజత్వం లేదని కావాలనే నవ్వు మరీ తెచ్చుకుని నవ్వుతుందనేది ఇటు ఇంటి సభ్యుల్లో అటు టీవీల్లో కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకుల్లో భావన కలిగింది. బిట్టూ అంటూ నాగార్జునను పిలవడం చూస్తే సుజాత ఓవరాక్షన్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు పోస్టులు పెట్టుకొచ్చారు.

Recommended Video

    Bigg Boss Telugu 4 : Jordar Sujatha Is Out From Bigg Boss House || Oneindia Telugu
    మోనాల్‌ను ఎవరు సేవ్ చేస్తున్నారు

    మోనాల్‌ను ఎవరు సేవ్ చేస్తున్నారు

    ఇక ఉత్తరాది భామ మోనాల్ గజ్జర్‌కు ఓట్లు ఎవరు వేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆమె ఇంటిలో ఉండేలా షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మోనాల్ ఉండటం వల్ల హౌజ్‌లో కాస్త స్పైస్ ఎక్కువగా ఉండటమే కాకుండా ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా రక్తి కడుతుండటంతో దాదాపుగా ఆమె ఎలిమినేట్ కారనే స్పష్టం అవుతోంది. ప్రతి చిన్న విషయానికి భావోద్వేగానికి గురవుతుండటం కూడా ప్రేక్షకులకు నచ్చడం లేదు. మరి అలాంటప్పుడు మోనాల్‌కు కచ్చితంగా తక్కువ ఓట్లే వచ్చి ఉంటాయని ,కానీ ఆమె ఎందుకు ఎలిమినేట్ కావడం లేదో అర్థం కావడం లేదని కొందరు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+