Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bigg Boss Telugu:డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు..ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?

నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షో క్రమంగా రక్తికడుతోంది. సాక్షి దీక్షిత్‌లా గేమ్ ఆడితే ప్రేక్షకులు ఎలిమినేట్ చేసేందుకు వెనుకాడరంటూ నాగార్జున ఇచ్చిన వార్నింగ్ బాగా పనిచేసినట్లుంది. అందుకే ఎవరి గేమ్ వారు చాలా తెలివిగా ఆడుతూ ముందుకు కదులుతున్నారు. ఇతర కంటెస్టెంట్స్‌ను ఇరికించే ప్రయత్నం చేస్తూ వారు కూడా సేఫ్ అయ్యేందుకు చూస్తున్నారు.

Recommended Video

    Bigg Boss Telugu 4 : Amma Rajashekar OR Sujatha Who Will Eliminate This Week?

    తద్వారా మరిన్ని రోజులు ఇంటిలో గడిపేందుకు పక్కా స్కెచ్‌తో గేమ్‌ను ఆడుతున్నారు. ఇక వారాంతం వచ్చేస్తున్న నేపథ్యంలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అంటూ చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఎలిమినేషన్ ప్రక్రియపై పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ సారి హౌజ్‌ నుంచి వచ్చేది ఎవరా అనేదానిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరగుతోంది.

    డేంజర్ జోన్‌పై చర్చ

    డేంజర్ జోన్‌పై చర్చ

    బిగ్‌బాస్ 4 సీజన్ క్రమంగా వేడెక్కుతోంది. కంటెస్టెంట్ల మధ్య బిగ్‌బాస్ గొడవపెట్టే టాస్కులు ఇవ్వడం ప్రారంభించాడు. దీంతో కంటెస్టెంట్లు కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోయి ఇతరులపై విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. ఇక ఎలిమినేషన్‌ టైం దగ్గరపడటంతో ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారా ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేదానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ వారం హోటల్ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇది రెండు ఎపిసోడ్‌లలో టెలికాస్ట్ అయ్యింది. అయితే ఈ టాస్కుపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి కనబర్చలేదని సమాచారం. ఎందుకంటే ప్రతి సీజన్‌లో ఇలాంటి టాస్కు ఇస్తున్న బిగ్‌బాస్ కొంత ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు.

    అమ్మా రాజశేఖర్ సుజాతలో బయటకు వచ్చేదెవరు..?

    అమ్మా రాజశేఖర్ సుజాతలో బయటకు వచ్చేదెవరు..?

    ఇక ఈ వారంలో లాస్య, సోహెయిల్, నోయల్, అఖిల్, మోనాల్, అభిజీత్, సుజాత, అరియానా, అమ్మ రాజశేఖర్‌లు నామినేట్ అయ్యారు. అయితే అమ్మా రాజశేఖర్, సుజాతలు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇతర కంటెస్టెంట్లతో పోలిస్తే ఈ ఇద్దరికీ తక్కువగా ఓట్లు పోలైనట్లు సమాచారం. గురువారం నాటికి ఓటింగ్‌లో సుజాత అట్టడుగున ఉన్నట్లు సమాచారం. అయితే ఓటింగ్ ఎటువైపైనా స్వింగ్ అయ్యే అవకాశం ఉంది. అమ్మా రాజశేఖర్‌కు పోలైన ఓట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి అయితే సుజాత కంటే కాస్త ఫర్వాలేదనిపించారని సమాచారం. అయితే వీరిద్దరిలో ఒకరు ఈ వారంలో ఎలిమినేట్ అవుతారనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే అమ్మా రాజశేఖర్ ఇంట్లో కొనసాగుతారా అనేది ఆసక్తికరంగా మారింది.

    బిగ్‌బాంబ్ వేసిన స్వాతి దీక్షిత్

    బిగ్‌బాంబ్ వేసిన స్వాతి దీక్షిత్

    ఇదిలా ఉంటే గతవారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ స్వాతి దీక్షిత్ ఎలిమినేషన్ ప్రక్రియపై పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఎవరైతే ప్రేక్షకులను ఎంటర్‌టెయిన్ చేస్తారో.. వారిని ప్రేక్షకులు ఆదరిస్తారని అదే ఎంటర్‌టెయిన్‌మెంట్ చేయలేకపోతే ఇలా స్వాతిని ఎలిమినేట్ చేసినట్లుగా చేస్తారని నాగార్జున చెప్పిన మాటలపై స్వాతి దీక్షిత్ అసహనం వ్యక్తం చేసింది. గత సీజన్‌లో నాగార్జున ఎప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడలేదని స్వాతి చెప్పుకొచ్చింది.

    నేను హౌజ్‌లో ఉండేందుకు చేయాల్సిన ప్రయత్నం చేయకపోయి ఉండి ఉంటే నాగార్జున మాటలను స్వీకరించేదాన్నని స్వాతి చెప్పుకొచ్చింది. ఇంటిలో ఉండేందుకు ప్రయత్నం చేసినప్పటికీ నాగార్జున ఇలా మాట్లాడటం సరికాదని స్వాతి వెల్లడించింది. ఇదిలా ఉంటే తాను హౌజ్‌లో ఉండి ఎంటర్‌టెయిన్ చేసినదంతా బిగ్ బాస్ నిర్వాహకులు ఎడిటింగ్‌లో తీసేశారని దాన్ని టెలికాస్ట్ చేయలేదని ఆమె తీవ్ర విమర్శలు చేశారు. తాను చేసిన ప్రయత్నంలో కనీసం 5శాతం టెలికాస్ట్ చేసినా తాను చాలా సంతోషంగా ఉండేదాన్నంటూ చెప్పిన స్వాతి.. షో నిర్వాహకులపైనే అనుమానం వ్యక్తం చేస్తూ బిగ్ బాంబ్ వేసింది.మొత్తానికి ఈవారంలో డేంజర్ జోన్‌ నుంచి అమ్మా రాజశేఖర్, సుజాతల్లో ఒకరు ఎలిమినేట్ అవుతారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+