• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సహజత్వం కోల్పోయిన బిగ్ బాస్4.!స్విమ్మింగ్ పూలా లేక హౌసా తేల్చుకోలేని ఫిమేల్ కంటెస్టెంట్లు.!

|

హైదరాబాద్ : కరోనా మహామ్మారి కన్నెర్ర జేస్తున్న తరుణంలో, ఉంటుందా ఉండదా అనుకున్న సమయంలో అందరి అంచనాలను తారుమారుచేస్తు బిగ్ బాస్4 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. దాదాపు 15-16మంది కంటెస్టెంట్లు ఒకే చోట వందరోజులు గడపాలు కాబట్టి, ప్రస్తుత పరిస్థితుల్లో చాలా వరకు బిగ్ బాస్4 సీజన్ ఉండకపోవచ్చని జోస్యం చెప్పారు. కాని అందరి ఊగానాలకు బ్రేక్ వేస్తూ బిగ్ బాస్ నిర్వాహకులు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఇచ్చిన మనోస్తైర్యంతో ఎంతో అంచనాలతో బిగ్ బాస్4 ప్రారంభం అయ్యింది.

ఆడంభరంగా మొదలైన బిగ్ బాస్4.. ఆగమౌతున్న కంటెస్టెంట్లు..

ఆడంభరంగా మొదలైన బిగ్ బాస్4.. ఆగమౌతున్న కంటెస్టెంట్లు..

కాగా కంటెస్టెంట్ల అంశంలో ఆచితూచి అడుగులు వేసి అన్ని రంగాల్లో నిష్ణాతులైన వారిని ఒకటి రెండు సార్లు పరీక్షించి ఎంపిక చేయడం జరిగింది. కాగా బిగ్ బాస్ సీజన్ ఒకటి నుండి సీజన్ మూడు వరకు కంటెస్టెట్లలో కనిపించని మెలో డ్రామా ఈ సీజన్ 4 కంటెస్టెంట్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అందుకు అనేక కారణాలు ఉండి ఉండొచ్చు. ప్రతి సీజన్ లో బిగ్ బాస్ ను ఎక్కువ సార్లు చూడటం, హైజ్ లో అనుసరించాల్సిన విధానంపై ఎక్కువగా ఊహించుకోవడం, కెమారా ఫోకస్ తమపైనే ఉంది., సన్నివేశాన్ని మరింత రక్తి కట్టించాలనే అత్యుత్సాహం కంటెస్టెంట్ల మద్య సహజత్వాన్ని దూరం చేసిందని చెప్పొచ్చు.

గంగవ్వ ఎంట్రీ ఓ ప్రయోగమే.. ఎంతవరకు నెట్టుకొస్తుందో మన అవ్వ..

గంగవ్వ ఎంట్రీ ఓ ప్రయోగమే.. ఎంతవరకు నెట్టుకొస్తుందో మన అవ్వ..

ప్రయోగాలకు వెనకాడని బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఈ సారి గంగవ్వ ను హౌస్ లోకి తీసుకుని అతి పెద్ద సాహసం చేసారు. అధునాతన నాగరికత పేరుతో మహిళా కంటెస్టెంట్లు వేసుకును అతి కురచ దుస్తుల మధ్య, పిక్స్ ప్యాక్ పేరుతో కండలు చూపించాలనే తపనతో స్లీవ్ లెస్ టీషర్టులు వేసుకునే కుర్రకారు మధ్య గంగవ్వలాంటి కంటెస్టెంట్ మనుగడ ఎంతవరకు కొనసాగుతుందనేది కూడా ప్రశ్నార్ధాకమే. ప్రేక్షకులకు వినోదాన్ని పంచే క్రమంలో కంటెస్టెంట్లు ఆడే చిత్ర వచిత్రమైన క్రీడల్లో గంగవ్వ భాగస్వామ్యం కూడా ఊహకందని టాస్కే.

నాగ్ వయసు తెలిసిపోతోంది.. కింగ్ అనిపిచుకోవాలంటే మేకప్ మార్చాల్సిందే..

నాగ్ వయసు తెలిసిపోతోంది.. కింగ్ అనిపిచుకోవాలంటే మేకప్ మార్చాల్సిందే..

ఇక ఈ బిగ్ బాస్4 సీజన్లో రెండు అంశాలు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి. అందులో హౌస్ లో మహిళా కంటెస్టెంట్లు కొందరు వేసుకునే డ్రెస్సులు, మరొకటి బిగ్ బాస్4 హోస్టు నాగార్జున ఆహార్యం. బిగ్ బాస్4 సీజన్లో నాగార్జున వయసు, ముఖకవళికలు, యాంకరింగ్ విధానం పై వయసుకు సంబంధించిన ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందనే చర్చ జరుగుతోంది. బిగ్ బాస్3 సీజన్లో అన్ని కోణాల్లో అలరించిన నాగార్జున ప్రస్తుత సీజన్ లో మాత్రం ఛార్మింగ్ కోల్పోయినట్టు కరిపిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

కురచదుస్తులు ధరిస్తున్న లేడీ కంటెస్టెంట్లు.. స్విమ్మిగ్ పూల్ ను మరిపిస్తున్న వైనం..

కురచదుస్తులు ధరిస్తున్న లేడీ కంటెస్టెంట్లు.. స్విమ్మిగ్ పూల్ ను మరిపిస్తున్న వైనం..

ఇక హౌస్ లో కొంత మంది మహిళా కంటెస్టెంట్లు వేసుకునే డ్రెస్సింగ్ విధానం మాత్రం కుటుంబ సమేతంగా షో చూసేందుకు అనువుగా లేదనే చర్చ కూడా జరుగుతోంది. స్విమ్మిగ్ పూల్ లో వేసుకునే డ్రెస్ ను మర్చిపోయి హౌస్ లో వేసుకుని కెమేరాల ముందు తిరుగుతున్నారా అనే భావన సగటు ప్రేక్షకిడికి కలుగుతోంది. అంత కురచ, పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకున్నప్పుడు కొన్ని సందర్బాల్లో పరవాలేదు అనిపించినా కొన్ని యాంగిల్స్ లో మాత్రం ఎబ్బెట్టుగా అనిపిస్తున్నట్టు తెలుస్తోంది. బిగ్ బాస్4 సీజన్ మొదలై రెండు రోజులో అవుతున్నప్పటికి వినోదం కన్నా వివాదం మాత్రం ఎక్కువ రాజేసిందనే చర్చ జరుగుతోంది. ముందు ముందు ఇంకెన్ని సిత్రాలు చోటుచేసుకుంటాయో భరించాల్సి ఉంది.

English summary
The Bigg Boss managers made a bold decision. Bigg Boss4 started with high expectations with the morale support given by Bigg Boss host Nagarjuna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X