ఇక నుంచి బయోమెట్రిక్, స్టూడెంట్సే కాదు టీచర్స్, నాన్ టీచింగ్స్ స్టాప్ కూడా, ఎక్కడ అంటే
విద్యా సంస్థల్లో ప్రమాణాలను మెరచుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. రాష్ట్రంలో గల అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనసరి చేయనుంది. ఇదీ కేవలం టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బందికే కాదు విద్యార్థులు కూడా వర్తించనుంది. దీనికి సంబంధించి ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

బయోమెట్రిక్ వల్ల కచితత్వం..
బయోమెట్రిక్ వల్ల సమయానికి సంబంధించి కచ్చితత్వం తెలియనుంది. స్టూడెంట్స్, ఫ్యాకల్టీకి అదీ యూజ్ అవనుంది. వారి హాజరుశాతానికి సంబంధించి డేటా పక్కాగా తెలియనుంది. స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేసేందుకు హాజరుశాతం తప్పనిసరి అవుతుంది. దానిని తెలుసుకునేందుకు బయోమెట్రిక్ హాజరు ఉపయోగపడనుంది. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఆయా విద్యా సంస్థల్లో ఎంత సమయం పని చేస్తున్నారు. వారి సెలవులు, ఇతరత్రా విషయాల కోసం బయో మెట్రిక్ హాజరు యూజ్ అవనుంది.

రిజిస్టార్ వాడేవారు.. కానీ
ఇప్పటివరకు ఫ్యాకల్టీ అయినా, స్టూడెంట్స్ అయినా హాజరు కోసం రిజిస్టార్ పెట్టేవారు. అందులో అవకతవకలు జరుగుతున్నాయని భావించి బయోమెట్రిక్ షురూ చేశారు. ఇప్పటికే కొన్ని స్కూళ్లలో బయోమెట్రిక్ హాజరు ఉంటుంది. దాని ఆధారంగానే వారికి జీతాలు ఉంటాయి. విద్యార్థులకు అయితే.. హాజరు శాతం బట్టి పరీక్షలకు అనుమతి ఇస్తారు. మరికొందరికీ ఉపకార వేతనాలు ఇవ్వడానికి ఉపయోగ పడుతుంది.

ఇందులో కూడా అవకతవకలు
అయితే బయోమెట్రిక్ కూడా మ్యానిప్లేటింగ్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది. అవును కొందరు రబ్బరు తొడుగులను కూడా వాడతారు. దానికి సంబంధించి అప్పట్లోనే వార్త వచ్చింది. మరీ వారు వారు కుమ్మక్కు అయితే పరిస్థితి ఏంటీ అనే ప్రశ్న తలెత్తింది. అలా కాక ఫేస్ రికగ్నైజేషన్ అయితే మేలు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కానీ దీనిపై ప్రభుత్వమే విధానపర నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications