రెప్పపాటులో ఘోర ప్రమాదం: యువతిపై నుంచి వెళ్లిన కారు, చచ్చుబడిపోయిన కాళ్లు, చేతులు..
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతోన్న అలేఖ్య అనే యువతిపై కారు వెళ్లింది. కారు డ్రైవ్ చేస్తున్న ప్రణీత అనే మరో అమ్మాయి పరాధ్యానంగా ముందుకెళ్తున్నారు. దీంతో అలేఖ్యను కారు 10 మీటర్ల వరకు తీసుకెళ్లింది. కాళ్లు, చేతులపై నుంచి కారు వెళ్లడంతో చచ్చుబడిపోయాయి. అలేఖ్యను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
సోమవారం మధ్యాహ్నం ఎస్ఆర్ నగర్ రహదారిపై ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో రద్దీ కూడా లేకపోవడం విశేషం. రోడ్డు నిర్మానుష్యంగా ఉన్న ఫుటేజీ స్పష్టంగా కనిపిస్తోంది. రోడ్డు దాటుతుండగా అటు వైపు నుంచి కారు, ముందు బైక్ వచ్చింది. రెప్పపాటులో అలేఖ్య రోడ్డు దాటబోతుండగా కారు ఢీ కొంది. ఏం జరిగిందో తెలుసుకునే లోపు యువతి కారు కింద ఇరుక్కుపోయింది. అక్కడున్న స్థానికులు చుట్టుమట్టారు. కారును ఆపి వేసి అందులో ఇరుక్కొన్న అలేఖ్యను బయటకు తీశారు.

Recommended Video

వెంటనే సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అలేఖ్య కాళ్లు, చేతులు చచ్చుబడి పోయాయని వైద్యులు చెప్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలియజేశారు. అలేఖ్య పేరెంట్స్‌కు సమాచారం అందజేశారు. కాసేపటి క్రితం తమతో ఉన్న కూతురు ఆస్పత్రిపై పడి ఉండటం చూసి పేరెంట్స్ కన్నీరు మున్నీరవుతున్నారు. నిర్లక్ష్యంగా కారు నడిపిన ప్రణీతతోపాటు.. బైక్ నడిపిన వాహనదారుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా












Click it and Unblock the Notifications