కారు బీభత్సం.. బైక్ ఢీ.. ట్రాఫిక్ ఎస్సైకి గాయాలు, ఆస్పత్రికి తరలింపు (వీడియో)
ఎప్పుడు, ఏ వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. మన తప్పులేకున్నా అప్పుడప్పుడు గాయపడతాం. కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయినా ఘటనలు కూడా మన కళ్లముందు కదలాడుతున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున కూడా ఇలాంటి ప్రమాదం జరిగింది. ఓ కారు కరెంట్ స్తంభాన్ని ఢీ కొంది. వెంటనే అటువైపు వస్తోన్న బైకర్ ఢీ కొని తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే అతను ఎస్సై కావడం విశేషం.
పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్సైగా లింగాల శ్రీనివాస్ పనిచేస్తున్నారు. డ్యూటీ కోసం ఇంటి నుంచి బయల్దేరారు. కానీ కారు రూపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. డ్యూటీకి బయల్దేరిన అతను చాదర్‌ఘాట్ వద్ద ప్రమాదానికి గురయ్యారు. అటుగా వస్తోన్న కారు కరెంట్ స్తంభాన్ని ఢీ కొంది. వేగంతో టర్న్ కావడంతో.. అదే సమయానికి రహదారిపై బైక్‌పై వస్తోన్న ఎస్సై కారును ఢీ కొన్నాడు.
కింద పడిపోవడంతో అతనికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఎస్సై శ్రీనివాస్‌ను సమీపంలో ఉన్న యశోద ఆస్పత్రికి తరలించారు. అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు.

ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. క్షణకాలంలో ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు ఫుటేజీలో కనిపించింది. అయితే కారు డ్రైవర్ మద్యం సేవించారని తెలుస్తోంది. అందుకోసమే అంతా ర్యాష్‌గా డ్రైవ్ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని తెలిపారు. డ్రైవర్‌కు వైద్య పరీక్షలు చేశాక.. మద్యం సేవించాడనే అంశంపై క్లారిటీ వస్తోందని పోలీసులు చెప్తున్నారు.
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications