కత్తులతో తెగబడ్డ దుండగులు.. వాకింగ్ చేస్తుండగా దాడి...

పంజాగుట్టలో దారుణం జరిగింది. ఓ ఆటో డ్రైవర్‌ను దుండగులు మట్టుబెట్టారు. ఉదయం వాకింగ్‌కు వచ్చిన రియాసత్ అలీ అనే ఆటో డ్రైవర్‌పై దుండగులు కత్తులతో దాడికి తెగబడ్డారు. తీవ్రగాయాలైన రియాసత్ అలీ రక్తపుమడుగులు కుప్పకూలిపోయాడు. అతనిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా.. ఫలితం లేకుండా పోయింది. రియాసత్ అలీ చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాకింగ్ చేసేందుకు రియాసత్ అలీ వచ్చాడు. అయితే అప్పటికే కాచుకొని కూర్చొన్న దుండగులు కత్తులతో తెగబడ్డారు. అక్కడే ఉన్న జనం మాత్రం వారిని ఆపేందుకు ప్రయత్నించలేదు. అలీని పొడిచి.. వారు తాపీగా వెళ్లిపోయారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయారని వైద్యులు తెలిపారు.

bizarre incident at hyderabad

రియాసత్ అలీ హత్య కేసు పాతకక్షల నేపథ్యంలో జరిగిందని పోలీసులు తెలిపారు. గతంలో ఆటో డ్రైవర్ అన్వర్ హత్యకు గురయ్యాడు. పంజాగుట్టలోనే అన్వర్‌ను రియాసత్ అలీ మట్టుబెట్టాడు. ఈ కేసులో అలీ జైలుకెళ్లాడు. రిమాండ్ ఖైదీగా ఉండి.. రెండురోజుల క్రితమే బెయిల్ మీద బయటకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అన్వర్ కుమారుడు, అతని స్నేహితుడు దాడికి కుట్రపన్నారు. ఆదివారం ఉదయం పథకం ప్రకారం కత్తులతో దాడి చేశాడు. విచక్షణరహితంగా కాల్పులు జరుపడంతో రియాసత్ అలీ చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని త్వరలో పట్టుకుంటామని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+