స్కూటీపై బుసలు.. చేతిని తాకిన నాగరాజు.. ఒక్కసారిగా ...

హైదరాబాద్ : చేతికి బొద్దింకో, బల్లి తాకితే ఎగిరి గంతేస్తాం. ఇదీ సాధారణంగా జరిగే ప్రక్రియ కూడా. అయితే చేతికి పాము తగలితే .. అదీ కూడా నాగుపాము తగిలితే పరిస్థితి ఏంటీ..? గుండె ఆగిపోయినంత పనవుతుంది ? అది మరి బండిపై వెళ్తుంటే .. పరిస్థితి వర్ణణాతీతం. అచ్చం ఇలాంటి పరిస్థితే యాదాద్రి జిల్లాకు చెందిన రాములుకు కలిగింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్‌నకు గురయ్యాడు.

ఉద్యోగం కోసం వెళ్తుండగా ..

ఉద్యోగం కోసం వెళ్తుండగా ..

యాదాద్రి జిల్లా చీకటి మామిడికి చెందిన రాములు ఎఫ్‌సీఐలో విధులు నిర్వర్తిస్తుంటాడు. ఎప్పటిలాగే మంగళవారం కూడా డ్యూటీకి బయల్దేరాడు. తన స్కూటీ తీసుకొని వెళ్తున్నాడు. అతని వాహనం కీసర పోలీసుస్టేషన్ పరిధిలోని రాంపల్లికి చేరుకుంది. మహంకాలి ఆలయం వద్దకు చేరుకోగానే అతని చేతికి ఏదో తగిలినట్టు అనిపిస్తోంది. దాంతో స్కూటీని ఆపి చూడగా .. హెడ్‌లైట్‌లో నక్కి ఉన్న నాగుపాము పిల్ల కనిపించింది. దానిని చూసి హతాశుడైన రాములు .. వెంటనే తన స్కూటీని కిందపడేశాడు. భయాందోళనకు గురయ్యాడు.

చేయి తగిలిన నాగరాజు

చేయి తగిలిన నాగరాజు

పక్కనే ఉన్న మహంకాళి ఆలయ చైర్మన్ రామారం వినోద్ గౌడ్‌కు విషయం చెప్పాడు. ఆయన వెంటనే పాములు పట్టే ఎరుకలి మైసయ్యను పిలిపించాడు. స్కూటీ హెడ్‌లైట్‌లో దాగి ఉన్న నాగుపాము పిల్లను బయటకు తీశాడు. తర్వాత దానిని అడవీలో వదిలేశాడు. తర్వాత రాములుకు ప్రథమ చికిత్స చేయించారు. తనకు తృటిలో ప్రాణాపాయం తప్పిందని .. రాములు ఊపిరి పీల్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరలైంది.

రంగారెడ్డి జిల్లాలోనూ ..

రంగారెడ్డి జిల్లాలోనూ ..

ఇదిలాఉంటే మరోవైపు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరులో చిప్ప మనోహర్ దంపతులు ఉంటున్నారు. అయితే ఆదివారం సాయంత్రం ఒక్కటే వర్షం. వానపడుతుండగా .. టీ తాగుదామని అనుకొంది. వెంటనే కిచెన్ రూంలోకి వెళ్లింది. అయితే అప్పటికే ఓ అతిథి అక్కడ ఆశీనులైంది. తన ఉనికి తెలియాలని బుసలు కొట్టింది. ఏంటా అని నాగమణి అటు ఇటు చూసింది. అసలే వర్షం, మబ్బు కమ్ముకొని ఉంది. కిచెన్ రూంలో లైట్ వేసి .. చూడగా ఒక్కసారిగా ఆమె గుండె జల్లుమంది. వంటగది ప్లాట్ ఫారం మీద నాగరాజు ప్రత్యక్షమయయ్యాడు. పడగవిప్పి ఉండటంతో ఆమెకు ఒళ్లు జల్లుమంది. నాగుపాము అని అరుస్తూ ఒక్కసారిగా వంటగది నుంచి బయటకు పరుగుతీసింది. పాము గురించి తెలుసుకొని కుటుంబసభ్యులు హడలిపోయారు. ఇరుగు పొరుగు వారి సహకారంతో నాగుపామును బయటకు పంపించేందుకు ప్రయత్నం చేశారు. దాదాపు గంటపాటు వారితో నాగరాజు ఆడుకున్నాడు. తర్వాత కిటికీల్లోంచి వెళ్లిపోవడంతో .. కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+