బీజేపీ నేత బలవన్మరణం.. ఎక్కడ.. ఎందుకంటే..
భూ వివాదం, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి, బీజేపీ నేత సంరెడ్డి వెంకట్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీలోని తొర్రూర్ గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డి.. తన వ్యవసాయ భూమి పక్కనే గల ఎకరం నర భూమికి సంబంధించి పక్క రైతు వద్ద అగ్రిమెంటు చేసుకున్నారు. అందుకోసం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద సుమారు రూ. కోటి తీసుకువచ్చారు. వాటికి మరో రూ. 30 లక్షలు కలిపి రైతుకి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏళ్లు గడుస్తున్నా సదరు రైతు భూమిని రిజిష్ట్రేషన్ చేయడం లేదు.
తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వడం లేదు. దీనిపై గత కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. మంగళవారం తీవ్ర మనస్తాపానికి గురైన వెంకట్‌రెడ్డి తన పొలం వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకోవడంతో తీవ్ర గాయలయ్యాయి. ప్రైవేటు ఆసుపత్రితో చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటలకు మృతి చెందాడు. సంరెడ్డి వెంకట్‌రెడ్డి నగరంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఇప్పించేవారు.

శ్రీ మిత్ర, జన చైతన్య, స్పెక్ట్రా, జీపీఆర్ వంది సంస్థలకు వేల ఎకరాల భూములు ఇప్పించినట్టు గ్రామస్థులు తెలిపారు. ప్రతి ఎన్నికల్లోనూ ఆయన తొర్రూర్ గ్రామం నుంచి ఎన్నికల బరిలో దిగేవారు, గత సంవత్సరం జరిగిన తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 17వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేశాడు. టీడీపీలో క్రియాశీలంగా పని చేసి.. అంటు నుంచి ఇటీవలే బీజేపీలో చేరారు. కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓడి పోయారు. వెంకట్‌రెడ్డికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications