Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యథా రాజా..తథా ప్రతినిధి: ధర్మారెడ్డి కామెంట్స్‌పై రాములమ్మ.. కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. ఆ కులం ఆఫీసర్లకు అక్షరం ముక్కరాదు అని వ్యాఖ్యనించగా.. అణగారిన వర్గాలు ఒంటికాలిపై లేచారు. దీంతో ఎమ్మెల్యే దిగిరాక తప్పలేదు. అలా అనలేదు.. క్షమించాలని బేరానికి వచ్చారు. అయితే ఎమ్మెల్యే వ్యాఖ్యలను బీజేపీ నేత, ఫైర్ బ్రాండ్ విజయశాంతి ఖండించారు. యథా రాజ అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి కామెంట్ చేశారు. తథ ప్రజా ప్రతినిధి అంటూ ధర్మారెడ్డిపై విరుచుకుపడ్డారు.

 యథా రాజా.. తథా ప్రతినిధి

యథా రాజా.. తథా ప్రతినిధి

బలహీన వర్గాల ప్రతినిధులకు సీఎం కేసీఆర్ విలువ లేకుండా చేస్తున్నారని విజయశాంతి ఫైరయ్యారు. ఆ ప్రభావమే టీఆర్ఎస్ నేతలపై పడినట్టు ఉందన్నారు. అట్టడుగు వర్గాల ప్రజలపై కామెంట్స్ చేస్తున్నారని ఫేస్‌బుక్ వేదికగా విమర్శించారు. బలహీన వర్గాల ప్రతినిధులయిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ డిప్యూటీ సీఎంలు రాజయ్య, కడియం శ్రీహరికు సీఎం కేసీఆర్ విలువ లేకుండా చేశారని తెలిపారు. ఆ అవమానపు ప్రభావమో ఏమో... నేడు వరంగల్ టీఆర్ఎస్ పార్టీ నేతలు ఫాలో అవుతున్నారని చెప్పారు.

సీఎం మాదిరిగాగే..

సీఎం మాదిరిగాగే..

బలహీనవర్గాల ప్రజలపై కామెంట్స్ చేసే స్థాయికి తెగిస్తున్నారని విరుచుకుపడ్డారు. యథా ముఖ్యమంత్రి... తథా ప్రజా ప్రతినిధి అని ఉదహరించారు. సీఎం దళిత డిప్యూటీ సీఎంలను అవమానకరంగా తీసి పక్కన పెట్టడంతో అణగారిన వర్గాలకు చెందిన ఉద్యోగులను హేళన చెయ్యకూడదనే అని నేతలు అనుకుంటున్నట్టు ఉందన్నారు.

అక్షరం ముక్క రాదా..?

అక్షరం ముక్క రాదా..?

ఆ కులం ఆఫీసర్లకు అక్షరం ముక్కరాదు.. ఎక్కడ చూసినా వాళ్లే.. మొత్తం నాశనం చేస్తున్నారు అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండలో జరిగిన ఓసీ జేఏసీ సభలో కొన్ని కులాలను ఉద్దేశించి ధర్మారెడ్డి వ్యా ఖ్యానించారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ సంఘాలు భగ్గుమన్నాయి. సోమవారం ధర్మారెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశాయి. కుల సంఘాల ఆగ్రహంతో ఎమ్మెల్యే దిగిరాక తప్పలేదు. ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేయలేదని, క్షమించాలని కోరారు.

Recommended Video

    Union Budget 2021 : కొత్త బడ్జెట్‌ ద్వారా ఎవరికి ప్రయోజనం ? ఎవరెవరికి నష్టం ? పూర్తి వివరాలివే!
    క్షమించండి అంటూ..

    క్షమించండి అంటూ..


    తన మాటలను వక్రీకరించారని ధర్మారెడ్డి తెలిపారు. తనపై బురద చల్లేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించారు. ఆ వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే కూడా క్షమించాలని కోరారు. ఆర్థికంగా వెనుకబడిన వారి రిజర్వేషన్ల గురించి వివరించే క్రమంలో అలా మాట్లాడానని ధర్మారెడ్డి అన్నారు. కానీ ఎమ్మెల్యే కామెంట్స్ మాత్రం బలహీనవర్గాల్లో ఆగ్రహానికి గురయ్యారు. క్షమించాలని చెప్పినా.. వినిపించుకునే పరిస్థితి లేదు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+