Johnny Master: జానీ మాస్టర్ ను కఠినంగా శిక్షించాలన్న రాజా సింగ్..!

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితుడిని అక్కడే కోర్టులో హాజరు పరిచారు. పీటీ వారెంట్ పై తెలంగాణకు తీసుకురానున్నారు. శుక్రవారం ఉప్పర్ పల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత నిందితుడి కస్టడీ కోరే అవకాశం ఉంది. అయితే జానీ మాస్టర్ ఇష్యూపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు.

అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ ను లైంగికంగా వేధించిన జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతిని డిమాండ్ చేశారు. అసిస్టెంట్ ను మతం మార్చుకోవాలని జానీ మాస్టర్ ఒత్తిడి చేసి లైవ్ జిహాదికి యత్నించాడని ఆరోపించారు.
సినీ ప్రరిశ్రమలో అవకాశం ఇస్తామని ఎంత మందిని జానీ మాస్టర్ వేధించాడో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. జానీ మాస్టర్ అరెస్ట్ చేసి నిజాలు బయట పెట్టాలన్నారు.

BJP MLA Raja Singh demanded strict investigation of choreographer Johnny Master

జానీ మాస్టర్ లాంటి వాళ్లు చాలా మంది ఉండొచ్చని అన్నారు. సినీ ఇండస్ట్రీలో పని చేయడానికి వచ్చే వారు చాలా సార్లు వేధింపులు ఎదుర్కున్నారని అన్నారు. పరిశ్రమలో ఇటువంటి అసాంఘిక అంశాలకు చెక్ పెట్టాలని కోరారు. అలాగే బాలీవుడ్ లో కూడా మహిళలకు వేధింపులు లేకుండా చూడాలని కోరారు. లేకుంటే, బాలీవుడ్‌కి ప్రపంచవ్యాప్తంగా చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందన్నారు. బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు.

చాలా మంది ప్రజలు హీరో, హీరోయిన్లు చూసి వారిని ఫాలో అవుతారని రాజా సింగ్ అన్నారు. చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. కొంత మంది వల్ల బాలీవుడ్ కే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వేధింపులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించడానికి చట్టు తీసుకురావాలని డిమాండ్ చేశారు. జానీ మాస్టర్ సరైన రీతిలో విచారణ చేయాలన్నారు. ఒక క్రిమినల్ ను ఎలా విచారిస్తారో అలానే జానీ మాస్టర్ ను విచారించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+