హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీతో కేసీఆర్ రహస్య ఒప్పందం.. గతంలో కూడా అనుకూలమే: ఉత్తమ్

|
Google Oneindia TeluguNews

రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతుపై కూడా విమర్శలు కొనసాగుతున్నాయి. విపక్షాల అభ్యర్థిగా పోటీ చేయబోనని శరద్ పవార్ ఇదివరకు స్పష్టం చేశారు. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ నిర్వహించిన మీటింగ్ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు. మరీ సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్ ఎవరికీ మద్దతు ఇస్తారో అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీకి వైసీపీ మద్దతు కంపల్సరీ.. మరీ టీఆర్ఎస్ దారెటు అనే ప్రశ్న తలెత్తింది. బీజేపీని సీఎం కేసీఆర్ పైకి తిడతారు.. కానీ లోన లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

రహస్య ఒప్పందం..

రహస్య ఒప్పందం..

కేసీఆర్‌కు, బీజేపీకి మధ్య రహస్య ఒప్పందం ఉందని మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల సమావేశానికి టీఆర్ఎస్ హాజరుకాకపోవడానికి కారణం ఏంటీ అని అడిగారు. అందులో కుట్ర దాగి ఉందని విమర్శలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. ఎన్డీఏను ఓడించే అవకాశం వచ్చినప్పుడు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

అప్పుడు మీరాకుమార్‌కు ఇవ్వలేదు

అప్పుడు మీరాకుమార్‌కు ఇవ్వలేదు

గత రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి మీరా కుమార్‌కు మద్దతు ఇవ్వలేదుని గుర్తుచేశారు. ఆర్ఎస్ఎస్ అనుకూల అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్‌కు రాష్ట్రపతిగా ఓటు వేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కరుడుగట్టిన బీజేపీ వాది వెంకయ్య నాయుడుకు అనుకూలంగా ఓటు వేశారని పేర్కొన్నారు. పార్లమెంటులో అన్ని విషయాల్లో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. బీజేపీకి టీఆర్ఎస్ దూరంగా ఉంటే ప్రతిపక్షాల అభ్యర్థికి టీఆర్ఎస్ ఓటు వేయాలి. లేదంటే టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని తెలంగాణ ప్రజలు అనుకుంటారని ఉత్తమ్ చెప్పారు.

2,3 సీట్లతో జాతీయ పార్టా..?

2,3 సీట్లతో జాతీయ పార్టా..?

కేసీఆర్ జాతీయ పార్టీ అట్టర్ ఫ్లాప్ అవుతుందని ఉత్తమ్ మండిపడ్డారు. కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. ఎనిమిదేళ్లలో బాగా అవినీతికి పాల్పడ్డారని గుర్తుచేశారు. స్వతంత్ర్య భారత దేశంలో అత్యంత అవినీతిపరుడు కేసీఆరేనని ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ రెండు లేదా మూడు ఎంపీ స్థానాలకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. రెండు, మూడు ఎంపీ స్థానాలతో జాతీయ పార్టీ ఏర్పాటు హాస్యాస్పదం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్ చేశారు. సింగిల్ డిజిట్ దాటనివారు కూడా జాతీయ పార్టీ అనడం ఏంటీ అని మండిపడ్డారు.

English summary
bjp-trs is Confidential agreement ex pcc chief uttam kumar reddy alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X