bigg boss-5:సన్నీకి l love you చెప్పిన అలియా భట్..? సృహ తప్పిన వీజే..?
బిగ్ బాస్-5 తెలుగు సీజన్ ఫైనల్ మరింత హైప్ తీసుకొస్తోంది. ఈ సారి గెస్టులు చాలా మందే ఉన్నారు. అయితే విన్నర్ వీజే సన్నీ అని దాదాపుగా కన్ఫామ్ అయిపోయింది. ఫైనల్ గురించి కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. గెస్టులుగా రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్, రష్మిక మందన్నా, దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్, నాని, సాయిపల్లవి, కృతీశెట్టి, జగపతిబాబు.. వీళ్లేకాక మరెంతోమంది సింగర్లు, నటీనటులు, సెలబ్రిటీలు షోలో సందడి చేశారు. తారల తళుకు మనడంతో బిగ్‌బాస్ స్టేజీ మరింత కలర్‌ఫుల్‌గా కనిపిస్తోంది.
ఐ లవ్ యూ సన్నీ..?
ఫైనలిస్ట్ సన్నీకి ఎంతో ఇష్టమైన హీరోయిన్ ఆలియాభట్. తన ఫేవరెట్ హీరోయిన్ అయిన ఆమె కళ్లముందు స్టేజీపై కనిపించగానే సంతోషంతో సన్నీ మెలికలు తిరిగిపోయాడు. అతడి ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తూ ఆలియా ఏకంగా సన్నీకి ఐ లవ్యూ చెప్పిందట. ఇది కలా? నిజమా? అనుకుంటూ గాల్లో తేలిపోయిన సన్నీ పరవశంతో సరదాగా కిందపడిపోయాడని తెలిసింది.

కిండపడిపోయిన వీజే
ఇష్టమైన బాలీవుడ్ హీరోయిన్‌తో ఐ లవ్‌యూ చెప్పించుకున్న సన్నీ ఆ క్షణాలను జీవితాంతం గుర్తుంచుకోవడం ఖాయం. అటు సరయూ నాగార్జునను డేట్‌కు వెళ్దామని అడిగింది. దీనికి సరేనంటూ తలూపిన నాగ్.. గ్రాండ్ ఫినాలే అయిపోగానే డేట్‌కి వెళ్దామని పచ్చజెండా ఊపాడటని తెలుస్తోంది. స్టార్ సెలబ్రిటీలు చేసిన హంగామా అంతా ఇంతా లేదు అని తెలుస్తోంది.

తగ్గిన శ్రీరామ్ హవా..?
సన్నీ టైటిల్ గెలుస్తారనే ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. శ్రీరామ చంద్ర.. ఇతను కూడా పాటలు పాడుతూ బాగానే ఆడాడు. చాలా సందర్భాల్లో నాగార్జున కూడా సపోర్ట్ చేశారు. తాను ఒంటరినని చాలా సందర్భాల్లో చెప్పారు. నేనున్నా అంటూ నాగ్ భరోసా ఇచ్చారు. ఓట్లు కూడా బానే పడుతున్న.. ప్రస్తుత పరిస్థితిని బట్టి.. టైటిల్ గెలవడం కష్టమే అనిపిస్తోంది. ఎందుకంటే గత వారం గాయం కావడంతో బిగ్ బాస్-5 ఫైనలిస్ట్‌గా నిలిచినా.. ఆడలేదనే బాధ అతనికి ఉంది. జనం కూడా ఆశించిన స్థాయిలో ఓట్లు వేశారా అనే సందేహాం నెలకొంది.

గొడవలు
సన్నీకి అనుహ్యంగా ఫైనలిస్టుగా మారాడు. తొలినాళ్లలో గొడవలు... కంపైంట్లు ఉండేవి. నాగార్జున కూడా చాలా సార్లు హెచ్చరించాడు. తర్వాత క్రమంగా అతనిలో మార్పు వచ్చింది. మెల్లగా తనను తాను మార్చుకొని ఫైనలిస్టు వరకు వచ్చారు. చివరికీ టైటిల్ చేజిక్కించుకున్నాడని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications