Hyderabad: ఘనంగా జరుగుతోన్న బోనాల పండుగ..
హైదరాబాద్ లో బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది. పాతబస్తీలోని లాల్ దర్వాజ్ సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, ఆడపడుచుల సందడి, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో బోనాలు పండుగ కొనసాగుతోంది. సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తులు క్యూ కట్టారు. బోనాల పండుగ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
అంబర్ పేట్ లోని మహంకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. హైదరాబాద్ సంస్కృతిలో గత వంద సంవత్సరాలుగా బోనాల ఉత్సవాలు ఒక సాంప్రదాయంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కేవలం తెలంగాణలోనే ఈ పండుగను ఘనంగా నిర్వహించుకుంటామని పేర్కొన్నారు. మొత్తం హైదరాబాద్ కు తలమానికంగా ఈ బోనాల ఉత్సవాలు నిలుస్తాయని తెలిపారు.

తెలంగాణ సంస్కృతిలో బోనాలకు విశేషమైన ప్రాధాన్యం ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. అలాగే నగరంలోని జరుగుతున్న వివిధ ప్రాంతాల్లో బోనాల పండుగ ఉత్సవాల్లో బండి సంజయ్ పాల్గొననున్నారు. చిలకలగూడ కట్ట మైసమ్మ దేవాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పూజలు చేశారు.
అమ్మవారిని దర్శించుకుని, పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారి దర్శణం కోసం భక్తులు బారులుతీరారు. బోనాల జాతర్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరపున భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే 11 లక్షల రైతు లకు రైతు రుణమాఫీ చేశామని చెప్పారు.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !!












Click it and Unblock the Notifications