బోనాలకు సిటీ సిద్దం: ట్రాఫిక్ మళ్లింపు ఇలా..? సోమవారం ఫలహార బండ్లు,
హైదరాబాద్‌లో ఆదివారం (రేపు) బోనాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి స్థానికులు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఫలహార బండ్లను ఊరేగించనున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అసలే ముసురు/ వర్షం కురుస్తోన్న నేపథ్యంలో రూల్స్ పాటించాలని పోలీసులు కోరుతున్నారు

ట్రాఫిక్ ఆంక్షలు
లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఇక్బాల్ మీనార్ నుంచి కట్టమైసమ్మ టెంపుల్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ మీదుగా మళ్లిస్తారు. ఇక కవాడిగూడ నుంచి డీబీఆర్ మిల్స్ మీదుగా వచ్చే వాహనాలను.. ఎమ్మార్వో ఆఫీసు వద్ద వార్త లేన్, ఇందిరా పార్క్ మీదుగా అశోక్ నగర్ వైపు పంపిస్తారు.

ఇలా పంపిస్తారు..
అంబేద్కర్ విగ్రహం నుంచి ఇందిరా పార్క్ వచ్చే వాహనాలను.. దోమల్‌గూడ మీదుగా ఇందిరా పార్క్ జంక్షన్ నుంచి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ వైపు మళ్లిస్తారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కట్టమైసమ్మ ఆలయం వైపు వచ్చే వాహనాలను.. దోమల్‌గూడలోని స్ట్రీట్ నంబర్ 5 మీదుగా రిలయన్స్ అపార్ట్‌మెంట్ (రమ్య హోటల్), లిబర్టీ వైపు పంపిస్తారు.

మంగళవారం ఉదయం వరకు
అంబర్‌పేట్ మహంకాళి టెంపుల్ వద్ద బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అంబర్‌పేట్‌లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉప్పల్ నుంచి అంబర్‌పేట్ వైపు వచ్చే జిల్లా, సిటీ బస్సులతో పాటు ఇతర వాహనాలను ఉప్పల్ క్రాస్ రోడ్స్, హబ్సిగూడ, తార్నాక, అడిక్‌మెట్, విద్యానగర్, ఫీవర్ హాస్పిటల్, టీవై మండలి, టూరిస్ట్ హోటల్ జంక్షన్, నింబోలి అడ్డా, చాదర్‌ఘాట్, సీబీఎస్‌కు మళ్లిస్తారు.

కోఠి నుంచి ఉప్పల్
కోఠి నుంచి ఉప్పల్ వైపు వెళ్లే సిటీ బస్సులు, ఇతర వాహనాలను నింబోలిఅడ్డ, టూరిస్ట్ హోటల్, టీవై మండలి, ఫీవర్ హాస్పిటల్, అడిక్‌మెట్, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్ క్రాస్ రోడ్ వైపుగా పంపిస్తారు. ఉప్పల్ నుంచి అంబర్‌పేట్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను.. రాయల్ జ్యూస్ కార్నర్, మల్లికార్జున నగర్, డీడీ కాలనీ, సిండికేట్ బ్యాంక్, శివం రోడ్ వైపు పంపిస్తారు. గోల్నాక, మూసారంబాగ్ వైపు వెళ్లే వాహనాలను సీపీఎల్ అంబర్‌పేట్, సాల్దానా గేట్, అలీ కేఫ్ ఎక్స్ రోడ్స్ మీదుగా పంపిస్తారు.












Click it and Unblock the Notifications