బుక్ ఫెయిర్ బ్యాక్.. 10 రోజులు ఓపెన్, ఒమిక్రాన్ దడ నేపథ్యంలో..

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వస్తోన్న క్రమంలో హైదరాబాద్‌లో బుక్ ఫెయిర్ జరుగుతుంది. పది రోజుల పాటు పాఠకులకు పుస్తకాలు అందుబాటులో ఉండనున్నాయి. కానీ ఎంత మంది జనాలు వస్తారో చూడాలీ మరీ. కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. ఎలాంటి భయాందోళనకు గురి కావొద్దు అని స్పష్టంచేస్తున్నారు. నిన్న ప్రారంభమైన బుక్ ఫెయిర్ 28వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. అయితే ఒమిక్రాన్ కొత్త కేసులు మాత్రం టెన్షన్ పుట్టిస్తున్నాయి.

చదవడం ఓ వరం.. పుస్తకం చదువినంతసేపు రచయితతోపాటు కథలోనే కదలాడుతూ ఉండే అవకాశం మనకు ఉంటుంది. ఎన్నో కథనాలు, నాటకాలు, సిద్దాంతాలు, ఎందరో మహానుభావుల జీవిత చరిత్రలు, సైన్స్, టెక్నాలజీ, సాహిత్యం.. ఒక్కటేమిటి కొన్ని వేల, లక్షల పుస్తకాలు ఒకే చోట పోగుచేసుకున్నాయి. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద గల ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తకాల పండుగలో జాతర వాతావరణమే మనకు కనిపిస్తుంది.

గతంలో కంటే భిన్నంగా ఎంతో సాహసం చేసి ఏర్పాటు చేస్తోన్న బుక్‌ ఫెయిర్ ప్రదర్శనకు సందర్శకులు సహకరించాలని నిర్వాహకులు కోరుతున్నారు. కోవిడ్‌ నిబంధనలు పాటించి మాస్కులు ధరించి రావాలని కోరుతున్నారు. తెలుగు, తమిళం, మళయాళం, హిందీ, ఇంగ్లీష్.. ఇలా 8 భాషలకు చెందిన పుస్తకాలు బుక్‌ ఫెయిర్‌లో ప్రదర్శనలో ఉన్నాయి.

book fair back: started at hyderabad ntr stadium

పది రోజుల పాటు సాగే బుక్‌ ఫెయిర్ ప్రతి రోజు మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 8.30 వరకు అందుబాటులో ఉంటాయి. ఇక వీకెండ్ శని, ఆదివారాల్లో, ఇతర పబ్లిక్‌ హాలీడేస్‌లో మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తారు. విద్యార్ధులు, లెక్చరర్లు ఐడీ కార్డులు చూపిస్తే అనుమతిస్తారు. ఇతరులకు టికెట్లు నామమాత్రంగా ఉంటాయి.

కరోనా వల్ల బుక్ ఫెయిర్ గత ఏడాది నిర్వహించలేదు. ఈ సారి ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రావడంతో ఆందోళన నెలకొంది. అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. రావాలని సందర్శకులు కోరుతున్నారు. వైరస్‌ను జయించాలంటే మాస్క్ మ్యాండెటరీ అనే సంగతి తెలిసిందే. శానిటైజర్ రాసుకుంటూ.. జాగ్రత్తగా ఉండాల్సిందే. అయితే రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న.. కొత్త వేరియంట్ వస్తోంది. దీంతో కాస్త భయాందోళన నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+