హైదరాబాద్‌లో కారు బీభత్సం: 180 స్పీడ్‌తో షాపుపైకి దూసుకెళ్లింది, మద్యం మత్తులో!
హైదరాబాద్ నరగంలోని వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీలో అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన మూసివున్న ఓ షాపు దుకాణాం షెటర్‌ను ఢీకొట్టింది.
హైదరాబాద్: నగరంలో మద్యం మత్తులో కొందరు వాహనాలను అతి వేగంగా నడిపి ప్రమాదాలకు కారణాలవుతున్నారు. ఎక్కువగా రాత్రి వేళల్లోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీలో అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన మూసివున్న ఓ షాపు దుకాణాం షెటర్‌ను ఢీకొట్టింది.
అయితే, ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయంలో కారు మితిమీరిన వేగంతో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షలు తెలిపారు. కారులో యువకులకు గాయాలయ్యాయని చెప్పారు. కారులోని యువకులంతా మద్యం మత్తులో ఉన్నారని తెలిపారు.

కాగా, ప్రమాద సమయంలో కారు 180 స్పీడ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన అనంతరం గాయాలపాలైన కారులోని యువకులు.. అక్కడ్నుంచి వెళ్లిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి ప్రమాదానికి గురైన కారు మాత్రమే ఘటనా స్థలంలో ఉంది.
కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ వాహనంలో ఉన్న యువకుల కోసం గాలిస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అత్యంత వేగంగా వచ్చిన కారు ఒక్కసారిగా అదుపుతప్పి షాపును ఢీకొన్నట్లు ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఇలాంటి ఘటనలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications